Saturday, May 25, 2024

విజ‌య్ కాంత్ కి మ‌రో సర్జ‌రీ – త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ర‌జ‌నీకాంత్ ట్వీట్

త‌న స్నేహితుడు త‌ర్వ‌గా కోలుకోవాల‌ని త‌మిళ సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ట్వీట్ చేశారు.డీఎండీకే అధ్యక్షుడు, నటుడు విజయ్ కాంత్ గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో సైతం విజయ్ కాంత్ ప్రసంగాలు చేయలేక చేతితో సైగలు చేస్తూ కనిపించారు. అప్పటి నుంచి విజయ్ కాంత్ కు సర్జరీ జరిగిన తర్వాత ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుంటున్నారు.అయితే తాజాగా మరో సర్జరీ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సర్జరీతో ఆయన కుడి పాదం నాలుగు వేళ్లు తొలగించినట్లు వార్తలు గుప్పమన్నాయి.

ఈ వార్తపై విజయకాంత్ పార్టీ సభ్యులు స్పందిస్తూ.. నాలుగు వేళ్లు తొలగించడమా అబద్దమని, రక్త ప్రసారం జరగడానికి ఒక వేలును మాత్రమే తొలగించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స అందుకుంటున్నారని తెలిపారు. ఇక దీంతో ఆయన అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. విజయకాంత్ ఆరోగ్యం గురించి సూపర్ స్టార్ రజినీకాంత్ ట్వీట్ చేశాడు . “నా అద్భుతమైన స్నేహితుడు త్వరగా కోలుకోని మళ్లీ మునుపటి కెప్టెన్ లా గర్జించాలని దేవుడ్ని కోరుకుంటున్నాను” అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement