Saturday, June 22, 2024

MMTS: పలు రూట్లలో ఇవాళ, రేపు ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు

పలు రూట్లలో హైదరాబాద్ లోని ఎంఎంటీఎస్ రైళ్ల ను రెండు రోజులు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన చేసింది.ఈ నెల 25, 26 తేదీల్లో పలు ఎంఎంటీఎస్ రైళ్లు, 4 డెమో సర్వీసులను నిలిపి వేసింది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ సంబంధించిన ఆధునీకరణ పనుల నేపధ్యం, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిల లాంటి నిర్మాణ ప‌నుల‌ వల్ల పలు రైళ్ల‌ను రద్దు చేస్తున్న‌ట్టు తెలిపింది.

- Advertisement -

ఇక ఇందులో, సికింద్రాబాద్‌ – ఫలక్‌నుమా, మేడ్చల్‌ – సికింద్రాబాద్‌, లింగంపల్లి – మేడ్చల్‌, హైదరాబాద్‌ – మేడ్చల్‌ మధ్య సేవలందించే 22 ఎంఎంటీఎస్‌ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు చీఫ్‌ పీఆర్వో సీహెచ్‌. రాకేశ్‌ తెలిపారు.ఇక వీటితో పాటు సిద్దిపేట – సికింద్రాబాద్‌ ల మధ్య సర్వీసులందించే 4 డెమూ రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అందులో కొన్ని రైళ్లను కేవలం రెండు రోజుల పాటు, మరికొన్నింటిని ఒక్కరోజు మాత్రమే సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement