Thursday, May 30, 2024

AP: వైసీపీ నేత దారుణ హత్య

ఏపీలో వైసీపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఈ ఘటన చోటుచేసుకుంది. మదనపల్లె పట్టణం శ్రీవారినగర్‌లో వైసీపీ నాయకుడు పుంగనూరు శేషాద్రి దారుణ హత్యకు గురయ్యారు.

- Advertisement -

శేషాద్రి ఇంట్లోకి దూరిన దుండగులు కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. దాంతో ఆయన రక్తపుమడుగులో కుప్పకూలారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. దుండగులు పరారీ కాగా.. వారిని పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement