Sunday, May 5, 2024

ఇద్ద‌రు మ‌గ పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన న‌టి న‌మిత‌-ఆనందంలో కుటుంబం

2017లో త‌న ప్రియుడు వీరేంద్ర‌ను వివాహం చేసుకొని సెటిల‌యింది హీరోయిన్ న‌మిత‌. ఆ తర్వాత సినిమాలలో కనిపించలేదు. తన పుట్టినరోజు నాడు అభిమానులకు గుడ్ న్యూస్ కూడా చెప్పింది. తాను గర్భవతి అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన ఈ ముద్దుగుమ్మ బేబీ బంప్ ఫోటోలను కూడా పోస్ట్ చేసింది.కాగా ఇద్ద‌రు పండంటి పిల్లలకు జన్మనిచ్చింది హీరోయిన్ న‌మిత‌. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసింది. సోషల్ మీడియా వేదికగా నమిత భర్తతో కలిసి తమ పిల్లలను ఎత్తుకున్న ఫోటోలు షేర్ చేసి అందర్నీ ఆశ్చర్యంతో పాటు ఆనందానికి కూడా గురి చేసింది . ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చినట్టు నమిత తెలిపారు. మేమంతా కూడా ఆరోగ్యంగానే ఉన్నామని , అభిమానుల ఆశీస్సులు తమకు ఎప్పటికీ ఉండాలని ఆమె కోరింది. శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా పిల్లలతో గుడికి వెళ్లిన నమిత దంపతులు వారితో కలిసి ఒక ఫోటోలను కూడా షేర్ చేశారు. ఇకపోతే గుజరాత్ కి చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో సొంతం, జెమిని, నాయకుడు, బిల్లా, సింహ వంటి చిత్రాలలో నటించి మెప్పించింది. అయితే 41 సంవత్సరాల వయసులో నమిత ప్రెగ్నెంట్ కావడం ఆశ్చర్యకరం. అభిమానులు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement