Sunday, April 28, 2024

బిపాస బ‌సు సీమంతం-వైర‌ల్ గా ఫొటోస్

త్వ‌ర‌లోనే త‌ల్లిగా ప్ర‌మోష‌న్ పొంద‌నుంది బాలీవుడ్ న‌టి బిపాషాబ‌సు. ప్రస్తుతం తన ప్రెగ్నెన్సీని ఎంజాయ్‌ చేస్తూ ఆ ఫొటోలను నిత్యం సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటూ మురిసిపోతుందీ. తాజాగా బిపాసా సీమంతం వేడుక వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా రెడ్ కలర్‌ ట్రెడిషనల్‌ శారీలో ఎంతో అందంగా ముస్తాబైంది బిపాసా. తన భర్తతో కలిసి రొమాంటిక్ పోజుల్లో ఫొటోలు దిగింది. అనంతరం వాటిని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. దీంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. సినీ ప్రముఖులు, ఫ్యాన్స్‌ బిపాసా దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. హిందీలో ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. మహేశ్‌ బాబుతో కలిసి టక్కరి దొంగ సినిమాలో సందడి చేసిందీ బెంగాలీ బ్యూటీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement