Friday, April 26, 2024

ఆచార్య అప్ డేట్: సెకండ్ సింగిల్ డేట్ ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా ఆచార్య షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కొరాటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ మూవీలో చిరుకు జోడిగా కాజల్ నటిస్తోంది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్యూట్ బ్యూటీ పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రామ్ చరణ్ సిద్దాగా.. నీలాంబ‌రి అనే పాత్ర‌లో పూజాహెగ్డే న‌టిస్తుంది. ఈ ఇద్దరిపై చిత్రీకరించిన ‘నీలాంబరి’ మెలోడీ గీతాన్ని ఈ నెల 5వ తేదీన ఉదయం 11:07 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు.ఇక ఈ సినిమా ఫస్టు సింగిల్ గా వచ్చిన ‘లాహే లాహే’ సాంగ్ కి కూడా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. మణిశర్మ సంగీత అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది 2022 ఫిబ్రవరి 4న రిలీజ్ కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement