Sunday, April 28, 2024

Accident – ఓఆర్ఆర్ పై రోడ్డు ప్ర‌మాదం – ఒక‌రి మృతి..

హైదరాబాద్ శివారులోని ఘట్‌కేసర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకెళ్లిన ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో కారు వేగంగా ఉండటంతో పల్టీలు కొట్టింది. ఈ ఘటన కొర్రెముల ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు దగ్గర ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా అతడి భార్య, పిల్లలకు తీవ్ర గాయాలు అయ్యాయి.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు ప్రారంభించారు. తీవ్రంగా గాయపడ్డ మృతుడి భార్య, పిల్లలను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement