Sunday, April 28, 2024

Biography – నేడు ‘మహా స్వాప్నికుడు’ పుస్త‌కావిష్క‌ర‌ణ

అమరావతి: ”అన్ని సమస్యలకూ మూలం ప్రజలే అనే రాజకీయ పార్టీల సంప్రదాయ ఆలోచనా ధోరణుల్ని కూకటివేళ్లతో పెకలించి… ప్రజలే అన్ని సమస్యలకూ పరిష్కారం అని చాటిచెప్పిన రాజకీయ నాయకుడు చంద్రబాబే. ప్రధాని నరేంద్రమోదీ గత పదేళ్లుగా అమలుచేస్తున్న స్వచ్ఛభారత్‌, ఆత్మనిర్భర్‌, బేటీ బచావో- బేటీ పఢావో వంటి పథకాల్ని పాతికేళ్లకు ముందే ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అమలు చేయడం ఆయన దూరదృష్టికి నిదర్శనం”
మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబుపై సీనియర్‌ పాత్రికేయుడు పూల విక్రమ్‌ రచించిన ‘మహా స్వాప్నికుడు’ పుస్తకంలోని వాక్యాలివి. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి… కృషి, పట్టుదల, నిరంతర శ్రమే ఆయుధాలుగా అంచెలంచెలుగా ఎదిగి, తన దార్శనికతతో రాష్ట్రానికి దశ, దిశ నిర్దేశించిన చంద్రబాబు గురించి పుస్తకంలో వివరించారు. కువైట్‌లో స్థిరపడిన ప్రవాసాంధ్రుడు వెంకట్‌ కోడూరి ప్రచురించిన ఆ పుస్తకాన్ని విజయవాడలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ గోపాలగౌడ చేతుల మీదుగా ఆవిష్కరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement