Sunday, April 28, 2024

పోలవరం ప్రాజెక్టు పనులను ప‌రిశీలించిన కేంద్ర నిపుణుల బృందం

పోలవరం, ప్రభ న్యూస్‌ :పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను కేంద్ర నిపుణుల బృందం శనివారం సందర్శించింది. పోలవరం ప్రాజెక్టును ఈ కమిటీ సందర్శించడం ఇది ఏడవ సారి. కేంద్ర జల సంఘం సభ్యులు కె. వోహ్రా, కేంద్ర జల సంఘం సీ.ఈ ఎం.కె.సిన్హా, డి.రంగారెడ్డి సి.ఈ కే జి బి ఓ సీడబ్ల్యూసీ హైదరాబాద్‌, సిఈ పిపిఓ సీడబ్ల్యూసీ( కన్వీనర్‌) ఆర్కే పచౌరి, పీ.పీ.ఏ మెంబర్‌ సెక్రటరీ ఎం.కే శ్రీనివాస్‌, డైరెక్టర్‌(ఎన్‌. పి) సీ.డబ్ల్యూ.సీ సంజరు కుమార్‌, సి. ఈ డిజైన్స్‌ సీ.డబ్ల్యూ.సీ కయ్యం మహమ్మద్‌, సి.ఈ పి.పి.ఏ హైదరాబాద్‌ ఏ.కే ప్రధాన్‌, డైరెక్టర్‌ పి.దేవెంద్ర రావు,సైంటిస్ట్‌ ఈసీఎస్‌ఎంఆర్‌ఏయస్‌ మనిష్‌ గుప్తా, డిప్యూటీ డైరెక్టర్‌(యన్‌.పి) సి.డబ్ల్యూ .సి నిఖిల్‌ జెఫ్‌, డిప్యూటీ- డైరెక్టర్‌ పి.పి.ఎ ఏ.ప్రవీణ్‌ తో కూడిన బృందం పోలవరం ప్రాజెక్టుని పరిశీలించారు. ప్రాజెక్టులోని అప్రోచ్‌ ఛానల్‌, రేడియల్‌ గేట్స్‌, స్పిల్‌ వే, గైడ్‌ బండ నిర్మాణాలను పరిశీలించారు.

గ్యాప్‌ త్రీ, ఎగువ కాపర్‌ డ్యామ్‌, పవర్‌ హౌస్‌, ఈ సి ఆర్‌ ఎఫ్‌ డ్యాం గ్యాప్‌ వన్‌, దిగువ కాపర్‌ డ్యాం ఈ సి ఆర్‌ ఎఫ్‌ గ్యాప్‌ టు-, డయాఫ్రమ్‌ వాల్‌ లను పరిశీలించారు. హెడ్‌ రెగ్యులేటర్‌, టెన్నల్‌ను , సాడిల్‌ డ్యామ్‌లను నిపుణుల బృందం సభ్యులు క్షుణంగా పరిశీలించారు. ప్రాజెక్టు ప్రాంతంలో మిగిలిన కీలక డిజైన్లను చూశారు. పనుల పురోగతిపై ఇంజినీరింగ్‌ అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యత ప్రమాణాలతో పనులు చేయాలని అందుకు తగిన సూచనలు చేశారు. ఆదివారం అధికారులతో సమీక్షించనున్నారు. ముందుగా ప్రాజెక్టు హిల్‌ వ్యూ పాయింట్‌ నుండి ప్రాజెెక్టు ప్రాంతాన్ని వీక్షించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement