Sunday, April 28, 2024

రెచ్చిపోతున్న లుచ్చాగాళ్లు, ఆడాళ్ల‌పై అరాచ‌కాలు.. కాప్చ‌ర్‌ చేసి లోప‌లేసిన షీటీమ్స్‌!

ఆర్టీసీ బ‌స్సులో మ‌హిళా ప్ర‌యాణికుల‌తో అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తిస్తున్న ఓ కండ‌క్ట‌ర్‌ను హైద‌రాబాద్ షీ టీమ్స్ క్యాచ్ చేశాయి. ప్రేమ పేరుతో ఓ మైన‌ర్‌పై లైంగిక‌దాడికి పాల్ప‌డిన యువ‌కుడిని కూడా అరెస్టు చేశారు. రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో నాలుగు వారాల నుంచి ఇట్లాంటి ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డ‌తున్న‌ మొత్తం 44 మందిని అదుపులోకి తీసుకున్న‌ట్లు షీ టీమ్స్ ప్ర‌క‌టించాయి.

ఇక‌.. టీఎస్ ఆర్టీసీలో కండ‌క్ట‌ర్‌గా డ్యూటీ చేస్తున్నా సయీద్ అమీన్ (40) బ‌స్సులో మ‌హిళా ప్ర‌యాణికుల‌తో అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తిస్తున్నాడు. టికెట్లు ఇచ్చే స‌మ‌యంలో తాక‌రాని చోట ట‌చ్ చేస్తుండటంతో చాలామంది ఇబ్బంది ప‌డుతున్నారు. దీంతో ఓ మ‌హిళా ప్ర‌యాణికురాలు నాచారం పోలీసుల‌కు కంప్లెయింట్ చేసింది. ఈ విష‌యంలో నిఘా పెట్టిన షీ టీమ్స్‌ ఆ కండ‌క్ట‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

అంతేకాకుండా హ‌య‌త్‌న‌గ‌ర్‌కు చెందిన ఆర్ శ్ర‌వ‌ణ్ (22) స్థానికంగా ఉన్న ఓ మైన‌ర్‌ను ప్రేమ పేరుతో లోబ‌రుచుకున్నాడు. ఆ త‌ర్వాత త‌న క‌జిన్ రూమ్‌కి తీసుకెళ్లి.. పెళ్లి చేసుకుంటాన‌ని మాయ‌మాట‌లు చెప్పి లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు. విష‌యం తెలుసుకున్న బాధితురాలి తండ్రి షీ టీమ్స్‌కు కంప్లెయింట్‌ చేశాడు. ఈ ఘ‌ట‌న‌లో కూడా శ్ర‌వ‌ణ్‌ని షీటీమ్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement