Friday, March 29, 2024

ఇక నియామకాలే, అగ్నివీరుల నియామకానికి కసరత్తు.. రెండు రోజుల్లో నోటిఫికేషన్‌: ఆర్మీ

దాదాపు ఎనిమిది రాష్ట్రాలలో నిరసనలు వెల్లువెత్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్‌ను అమలు చేసేందుకే ప్రయత్నిస్తోంది. అతి త్వరలో అగ్నివీరుల నియామకాలు మొదలుపెట్టేందుకు త్రివిధ దళాలు కసరత్తు చేస్తున్నాయి. ముందుగా నోటిఫికేషన్లు విడుదల చేసి ఆ తర్వాత ఎంపిక ప్రక్రియను చేపడతారు. రాబోయే రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ పాండే ప్రకటించగా ఈనెల 24నుంచి నియామక ప్రక్రియ ప్రారంభిస్తామని వైమానిక దళం ప్రకటించింది. తాము కూడా అతిత్వరలోనే నియామక ప్రక్రియ మొద లుపెడతామని నౌకాదళం వెల్లడించింది. అగ్నిపథ్‌ అభ్యర్థుల వయోపరిమితిని మూడేళ్లు పెంచడంపట్ల ఆర్మీ చీఫ్‌ జరనల్‌ మనోజ్‌ పాండే స్వాగతించారు.

తొలి బ్యాచ్‌కు డిసెంబర్‌లో శిక్షణ మొదలుపెడతామని స్పష్టం చేశారు. ఆర్మీ అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌ చూసుకోవచ్చని . ఆ తర్వాత రిజిస్ట్రేషన్‌, ర్యాలీలు, నియామకాలపై వివ రాలతోకూడిన షెడ్యూల్‌ను ప్రకటిస్తామని చెప్పారు. కాగా జూన్‌ 24నుంచి ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నివీరుల నియామక ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వి.ఆర్‌. చౌదరి తెలిపారు. ఆవేశాలతో అవకాశాలను పోగొట్టుకోవద్దని యువతకు సూచించారు. యువతీయువకులను అగ్నివీరులుగా చేర్చుకునేందుకు నౌకాదళం సిద్ధంగా ఉందని, త్వరలోనే నియామక ప్రక్రియ వివరాలు వెల్లడిస్తామని నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌. హరికుమార్‌ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement