Monday, April 29, 2024

విద్యుత్‌ శాఖకు స్వల్పంగా పెంచిన నిధులు.. బడ్జెట్‌లో రూ.12,727 కోట్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : నష్టాల్లో ఉన్న విద్యుత్‌ సంస్థలను గట్టెక్కించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి సోమవారం అసెంబ్లిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్యుత్‌ శాఖకు రూ.12,727 కోట్లను కేటాయించారు. గత బడ్జెట్‌లో రూ.12,198 కోట్లు ప్రవేశపెట్టగా.. ఈసారి గత బడ్జెట్‌ కంటే అదనంగా అదనంగా రూ.529 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. విద్యుత్‌ పంపిణి సంస్థలకు ఆర్థిక ఇబ్బందులు తొలిగితే.. 24 గంటల విద్యుత్‌ సరఫరాకు ఢోకా ఉండదని సంబంధిత శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన పవర్‌ సెక్టార్‌.. రాష్ట్ర విభజన తర్వాత ప్రతి ఏటా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం ఆదుకుంటోంది. 2019-20 సంవత్సరంలో రూ.7,566 కోట్లు, 2020-21లో రూ.10,611 కోట్లు, 2021-22లో రూ.11,037 కోట్లు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.11,198 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.

రైతాంగానికి నిరంతరం కరెంటును అందిస్తున్న విద్యుత్‌ శాఖకు మాత్రం నిధులను పెంచిందని చెబుతున్నారు. కాగా, విద్యుత్‌ శాఖకు కేటాయించిన రూ.12,198 కోట్లలో ప్రగతి పద్దు కింద రూ.8,8862.75 కోట్లను చూపించారు. అందులో వ్యవసాయనికి ఉచిత విద్యుత్‌కు గాను టీఎస్‌ ట్రాన్స్‌కోకు రూ.8,260 కోట్లు, స్పిన్నింగ్‌ మిల్లుల కరెంట్‌కు రూ.102.25 కోట్లు ఈఆర్‌సీకి రూ.25 లక్షలు, ఉదమ్‌ పథకం కింద విద్యుత్‌ సంస్థలకు రూ.500 కోట్లు, తెలంగాణ పవర్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌కు రూ.25 కోట్లను బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement