Thursday, March 28, 2024

రాయల్​ ఎన్​ఫీల్డ్​ నుంచి తొలి ఈవీ.. 2024లో లాంచ్​ అయ్యే చాన్స్!

ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈవీలవైపు అడుగులు వేస్తోంది. ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో ఈ మార్పు ఇంకాస్త వేగంగానే జరుగుతోంది. ఆటో సంస్థలు అన్ని అటు 4 వీలర్స్​, ఇటు 2 వీలర్స్ ఈవీలను టచ్​ ఇస్తున్నాయి. కొత్త కొత్త మోడల్స్​ను లాంచ్​ చేస్తున్నాయి. ఇక దేశంలో క్రేజీగా క్రేజ్​ ఉన్న రాయల్​ ఎన్​ఫీల్డ్​ సైతం ఈవీవైపు అడుగులు వేస్తోంది. ఈవీ సెగ్మెంట్​లోకి మరో 18- 24 నెలల్లో ఈ సంస్థ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే.. 2024 చివరి నాటికి ఇండియా రోడ్ల మీద రాయల్​ ఎన్​ఫీల్డ్​ తొలి ఈవీ మోడల్​ తిరుగనుంది.

భారీగా పెట్టుబడులు..

ఈవీ మార్కెట్​లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్స్​ ప్రారంభించింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ రాయల్​ ఎన్​ఫీల్డ్​. ఇందులో భాగంగానే ప్రముఖ ఈవీ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్​ మాజీ సీటీఓ ఉమేశ్​ కృష్ణప్పను తమ బోర్డులో చేర్చుకుంది. ఎలక్ట్రిక్​ వెహికిల్​ బిజినెస్​ వృద్ధి కోసం ఇండియా, యూకేలో ఇప్పటికే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈవీ సెగ్మెంట్​పై అదనంగా 150మిలియన్​ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు రాయల్​ ఎన్​ఫీల్డ్​ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఏడాదికి 1.2లక్షలు- 1.8లక్షల మధ్యలో ప్రొడక్షన్​ చేయగలిగే సామర్థ్యాన్ని సాధించేందుకు చూస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక ప్లాట్​ఫామ్​ను తయారు చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు సమాచారం. ఇక 2024లో సంస్థ నుంచి తొలి ఈవీని లాంచ్​ చేయాలన్న పట్టుదలతో రాయల్​ ఎన్​ఫీల్డ్​ ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement