Saturday, April 27, 2024

భారత సంతతి ప్రొఫెసర్‌కు అమెరికాలో అరుదైన గౌరవం

అమెరికాలో భారతీయ సంతతికి చెందిన ప్రొఫెసర్‌ గణేశ్‌ ఠాకూర్‌, టెక్సాస్‌ అకాడమీ ఆఫ్‌ మెడిసిన్‌, ఇంజనీరింగ్‌, సైన్స అండ్‌ టెక్నాలజీ(టీఏఎమ్‌ఈఎస్‌టీ) వైస్‌ ప్రెసిడెంట్‌గా నియమితులైయారు. టెక్సాస్‌లో పరిశోధన, ఆవిష్కరణ, సంబంధిత వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేడానికి రాష్ట్రంలోని వివిధ శాస్త్రవేత్తలు, పరిశోదకులను ఒక చోట చేర్చే సంస్థ -టీఏఎమ్‌ఈఎస్‌టీ. యూనివర్శిటీ ఆఫ్‌ హ్యూస్టన్‌ ఇంజనీరింగ్‌లో విశిష్ట ప్రొఫెసర్‌గా ఉన్న ఠాకూర్‌ను టీఏఎమ్‌ఈఎస్‌టీ డైరెక్టర్ల బోర్డు వైస్‌ ప్రెసిడెంట్‌గా నియమించింది. బ్రెండెన్‌ లీతో పాటు అధ్యక్షుడిగా పని చేస్తారు.

జార్ఘండ్‌కు చెందిన ఠాకూర్‌, టీఏఎమ్‌ఈఎస్‌టీ టీమ్‌కు నాయకత్వం వహించే మొదటి హ్యూస్టన్‌ యూనివర్శిటీ అధ్యాపక బృంద సభ్యుడు. వైస్‌ ప్రెసిడెంట్‌గా తన రెండేళ్ల పదివీకాంలో ఠాకూర్‌, సిద్ధాంతపరమైన ప్రణాళికలు, కార్యక్రామాలు, కమ్మూనికేషన్‌లో బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లను సమన్వయం చేయడంతో పాటు సలహాలదారునిగా ఉంటారు. ఆయనకు 2025లో టీఏఎమ్‌ఈఎస్‌టీకు అధ్యక్షుడిగా పదోన్నతి పొందే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement