Wednesday, May 8, 2024

దేశాభివృద్ధికి పునరంకితమవుదాం.. ఏపీ భవన్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశ రాజధానిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రిపబ్లిక్ డే పరేడ్ జరిగిన కర్తవ్యపథ్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ భవన్‌లో ఉన్నతాధికారులు వేడుకలు నిర్వహించారు. గోదావరి బ్లాక్ ఎదురుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ (పి.ఆర్.సి) అదిత్యనాథ్ దాస్, రెసిడెంట్ కమిషనర్ (ఆర్.సి) సౌరభ్ గౌర్, స్పెషల్ కమిషనర్ ఎన్. వి. రమణా రెడ్డి, అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ (ఏ.ఆర్.సి) హిమాంశు కౌశిక్ హాజరయ్యారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో భవన్ ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఉన్నతాధికారులు ఆ తర్వాత జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అదిత్యనాథ్ దాస్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం రోజున రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ సమాజానికి చేసిన సేవలను యావత్ ప్రజానీకం స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. రాజ్యాంగం ప్రాముఖ్యతను అందరూ తెలుసుకుని దేశాభివృద్ధికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement