Friday, May 3, 2024

భారతీయ సినిమాకి గర్వకారణం.. చిరంజీవి ట్వీట్

త‌న త‌న‌యుడు..న‌టుడు రామ్ చ‌ర‌ణ్ ..ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిపై ప్ర‌శంస‌లు కురిపించారు మెగాస్టార్ చిరంజీవి.మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ అమెరికా వెళ్లారు. జీఎంఏ (గుడ్ మార్నింగ్ అమెరికా) టెలివిజన్ షోన్ లో పాల్గొన్నారు. ఈ షోలో పాల్గొన్న తొలి తెలుగు నటుడిగా ఆయన రికార్డు సృష్టించారు. దీనిపై ఆయన తండ్రి, మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. తన కుమారుడు ఈ షోలో పాల్గొన్న ఫొటోలు, ఎపిసోడ్ లింగ్ ను ట్విటర్ లో షేర్ చేశారు. ‘రామ్ చరణ్ ప్రఖ్యాత గుడ్మార్నింగ్ అమెరికాలో పాల్గొన్నాడు. ఇది తెలుగు, భారతీయ సినిమాకి గర్వకారణం. దార్శనికుడైన రాజమౌళి మెదడులో పుట్టిన ఒక ఉద్వేగ భరితమైన ఆలోచన శక్తి ప్రపంచాన్ని ఎలా ఆవరించిందో చూస్తే ఆశ్చర్యంగా ఉంద‌ని ట్వీట్ చేశారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ అత్యంత ప్రతిష్ఠాత్మక ఆస్కారు అవార్డు రేసులో నిలిచింది. ఈ చిత్రంలోని నాటునాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ కు నామినేట్ అయింది. వచ్చే నెల 12న ఆస్కార్ అవార్డుల ఫలితాలు వెలువడనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement