Tuesday, May 14, 2024

పాల‌పుంత‌లో కొత్త వింత‌.. అరుదైన ఘ‌ట‌న‌గా పేర్కొన్న ఆస్ట్రేలియ‌న్ ప‌రిశోధ‌కులు..

పాలపుంతలో ఒక విచిత్రమైన స్పిన్నింగ్‌ వస్తువును ఆస్ట్రేలియన్‌ పరిశోధకులు కనుగొన్నారు. ఇప్పటి వరకు ఇలాంటి వింతను గుర్తించలేదని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. అండర్ గ్రాడ్యుయేట్‌ థీసిస్‌పై పనిచేస్తున్న విశ్వవిద్యాలయ విద్యార్థి మొదట ఈ వస్తువును గుర్తించాడు. అది ప్రతి గంటకు మూడు
సార్లు రేడియో శక్తిని విడుదల చేస్తున్నట్లు నిర్ధారణకు వచ్చాడు. పల్స్‌ ”ప్రతి 18.18 నిమిషాలకు క్లాక్‌ వర్క్‌ లాగా వస్తోంది” అని ఖగోళ భౌతిక శాస్త్రవేత్త నటాషా హర్లీ-వాకర్‌ చెప్పారు. విద్యార్థి
గుర్తించిన వింతవస్తువుపై పరిశోధనకు వాకర్‌ నాయకత్వం వహిస్తున్నారు. పశ్చిమ ఆస్ట్రేలియా అవుట్‌బ్యాక్‌లోని మర్చిసన్ వైడ్‌ఫీల్డ్‌ అర్రే అని పిలువబడే టెలిస్కోప్‌ను ఉపయోగించి ఈ
కొత్త దృశ్యాన్ని గుర్తించామని చెప్పారు. పల్సర్‌ల వంటి స్విచ్‌ ఆన్‌- ఆఫ్‌ చేసే ఇతర వస్తువులు విశ్వంలో
ఉన్నప్పటికీ 18.18 నిమిషాల కొకసారి సంకేతాలిచ్చే వస్తువును చూడటం ఇదే తొలిసారి అని చెప్పారు. కొన్ని సంవత్సరాల కిందటి డేటాను పరిశీలిస్తే వారు కొన్ని వాస్తవాలను గుర్తించగలిగారు.

ఈ వస్తువు భూమి నుండి 4,000 కాంతి సంవత్సరాల [Light years] దూరంలో ఉంది. చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. చాలా బలమైన అయస్కాంత క్షేత్రాన్ని కలిగి ఉంది. అయితే దీనికి
సంబంధించి ఇంకా చాలా రహస్యాలు ఛేదించాల్సి ఉంది అని హార్లీ-వాకర్‌ తెలిపారు.

ఇది తెల్ల మరగుజ్జుగా కనిపిస్తోంది. బహుశా కూలిపోయిన నక్షత్రం అవశేషం కూడా కావచ్చు. ”కానీ ఇది చాలా అసాధారణమైనది” అని హర్లీ-వాకర్‌ చెప్పారు. అంతరిక్షం నుండి వచ్చే శక్తివంతమైన, స్థిరమైన రేడియో సిగ్నల్‌ను వేరే ఏదైనా జీవ రూపం ద్వారా పంపారా అనే ప్రశ్నతో హార్లీ ఏకీభవించారు. తొలుత గ్రహాంతర వాసులుగా భావించాము. కానీ, పరిశోధనా బృందం విస్తృత శ్రేణి పౌన:పున్యాలలో సిగ్నల్‌ను గమనించగలిగింది. అంటే ఇది సహజ ప్రక్రియ అయి ఉండాలి అని అభిప్రాయపడ్డారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement