Friday, April 26, 2024

అనుప‌మ‌తో నిఖిల్ రొమాన్స్‌.. ఏడు రంగుల వాన అంటూ డ్యూయెట్స్‌!

కార్తికేయ-2 మూవీతో పాన్ ఇండియా హిట్ అందుకున్న హీరో నిఖిల్ సిద్దార్థ్ , అనుపమ పరమేశ్వరన్ కాంబోలో వస్తున్న లవ్ స్టోరీ “18పేజిస్”. ఈ సినిమాకి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథ అందించారు. వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న “జీఏ 2” పిక్చర్స్ నిర్మిస్తున్నారు. “కుమారి-21F” సినిమా దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ సంబంధించిన టీజర్, “నన్నయ్య రాసిన”, “టైం ఇవ్వు పిల్ల” అనే పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

కాగా, “18పేజిస్” మూవీ నుంచి మరో సాంగ్ ఒకటి రిలీజ్ అయ్యింది. ఇక ఈ మూవీ కోసం శ్రీమణి రాసిన “ఏడు రంగుల వాన” అనే పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఇదివరకే రిలీజైన రెండుపాటలకు శ్రీమణి సాహిత్యం అందించారు. ఇప్పుడు సిద్ శ్రీరామ్ పాడిన ఈ “ఏడురంగుల వాన” పాటకు కూడా అదే స్థాయిలో శ్రీమణి లిరిక్స్ అందించారు. సిద్ శ్రీరామ్ ఇప్పుడు తెలుగు సినిమాలలో ఒక సంగీతం సంచలనం అన్న సంగతి తెలిసిందే….

- Advertisement -

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement