Sunday, April 28, 2024

మక్కకు దిక్కెవరు, వరి స్థానంలో పెరిగిన జొన్న.. రెండు సీజన్ల నుంచి కొనుగోళ్లు లేవ్​..

రాష్ట్రంలో ఈ ఏడాది సాగైన మొక్కజొన్న పంట కొనుగోలు జరుగుతుందో లేదోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 2020 యాసంగి నుంచి మొక్కజొన్నను మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేయడంలేదు. రెండు సీజన్ల నుంచి కొనుగోలు చేయకపోవడంతో వ్యాపారుల ఇష్టారాజ్యంగా అడ్డిపావుశేరుకు కొనుగోలు చేశారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఈ సారి యాసంగిలో వరిని తగ్గించి ఇతర పంటలు వేయాలని ప్రభుత్వం సూచించడంతో రైతులు మొక్కజొన్నను అధికంగా సాగుచేశారు. ప్రస్తుత యాసంగిలో ఇప్పటివరకు 4,74,722 ఎకరాల్లో మక్క పంట సాగైంది. లక్షల ఎకరాల్లో పంట సాగైనా.. కొనుగోలుపై ప్రభుత్వం ఇంతవరకూ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించక పోవడంతో రైతులు ఈ సారి కూడా నష్టం తప్పదనే అంచనాలకు వస్తున్నారు. ఈ సారి పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే.. రైతులు కోట్లలో నష్టపోవాల్సి వస్తుందని అంచనా.

వ్యాపారుల ఇష్టారాజ్యం అడ్డిపావుశేరు ధర..

గతంతో పోలిస్తే ఈ యాసంగిలో మొక్కజొన్న అధిక విస్తీర్ణంలో సాగైంది. ఎకరానికి సగటున 31క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేస్తుండగా, సుమారు 13లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా పంట దిగుబడి రానుంది. ఈ మేరకు మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేస్తే తప్ప.. వ్యాపారులు కొనుగోలు జరిపితే మాత్రం రైతులకు నష్టం తప్పదని రైతు సంఘం నేతలు అంటున్నారు.
ప్రభుత్వం కొనుగోలుపై ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకపోవడంతో ఇప్పటికే ప్రైవేటు వ్యాపారులు రంగంలోకి దిగుతున్నారు. క్వింటాల్‌కు రూ.500 కోత విధించి మరీ కొనుగోలు చేసేందుకు వ్యాపారులు సిద్ధమవుతుండడంతో నష్టం తప్పదని అన్నదాతలూ వాపోతున్నారు. ఒకవేళ క్వింటాల్‌ కు రూ.500 కోత విధిస్తే సుమారు రూ.600 కోట్లకు పైగా రైతులు నష్టపోవాల్సి వస్తుందని తెలుస్తోంది.

కంది, శనగ కొనుగోళ్లు..

ప్రస్తుతం రాష్ట్రంలో సాగైన కంది, శనగల కొనుగోళ్లు ముమ్మరం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా గురువారం వరకు రూ.7 కోట్ల విలువైన 1,119 క్వింటాళ్ల కందులను మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేయగా, రూ.7.85 కోట్ల విలువైన 1,501 క్వింటాళ్ల శనగను అధికారులు కొనుగోలు చేశారు. కందుల కొనుగోళ్ల కోసం ఇప్పటివరకు 103 కేంద్రాలను గుర్తించగా ప్రస్తుతానికి 58 సెంటర్లలో కొనుగోలును ప్రారం భిం చారు. శనగల కోసం 38 కేంద్రాలను గుర్తించి, ప్రస్తు తానికి 18సెంటర్లలో కొను గోలు జరుపుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రా ల్లో కేంద్రం నిర్ణయించిన మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు మద్ద తు ధరలు కంది క్వింటాల్‌కు రూ.6,900, శనగకు రూ.5,290 ఉంది.

- Advertisement -

ఉత్పత్తికి, కేంద్రం టార్గెట్‌కు మధ్య వ్యత్యాసం..

వానాకాలంలో కంది 7.71లక్షల ఎకరాల్లో సాగు కాగా, శనగ 3.49 లక్షల ఎకరాల్లో సాగైంది. విస్తీర్ణం గణనీయంగా పెరగడంతో ఉత్పత్తి కూడా అదే స్థాయిలో పెరగనుంది. ఈ మేరకు ఉత్పత్తితో సంబం ధం లేకుండా నామినల్‌గా కొనుగోలు చేసేందుకు కేంద్రం అంగీకరించడంతో ఉత్పత్తికి, కేంద్రం ఇచ్చిన టార్గెట్‌కు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఈ మేరకు కంది సుమారు 4.67 లక్షల టన్నులు వస్తుం డగా, కేంద్రం 80 వేల టన్నులకు, శనగ 2.31 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తుండగా, కేంద్రం కేవలం 58,435 టన్నులనే కొనుగోలు చేసేందుకు అవకాశం ఇచ్చింది. అధిక ఉత్పత్తి వస్తున్న నేపథ్యంలో కొను గోలు టార్గెట్‌ను మరింత పెంచాలని మార్క్‌ఫెడ్‌ అధికా రులు కేంద్రాన్ని కోరనున్నట్టు తెలుస్తోంది.

2020 యాసంగి నుంచి నిలిచిన కొనుగోలు..

దేశవ్యాప్తంగా అవసరానికి మించి మొక్క జొన్నల నిల్వలు ఉన్నాయన్న కారణంతో ప్రభు త్వం రెండు సీజన్ల నుంచి మక్కల కొనుగోలు నిలిపివేసింది. అంటే 2021 యాసంగి, వానా కాలంలో అసలు కొనుగోలు జరుపలేదు. గతంలో 2020 వానా కాలంలో 2లక్షల 65వేల మెట్రిక్‌ టన్నులను మాత్రమే కొనుగోలు చేశారు. ఈ నేప థ్యంలో ఈసారి కొనుగోలు ఏంటన్నది ప్రశ్నార్థ కంగా మారింది. గతంలో కొనుగోలు చేసిన మక్కలను ప్రభుత్వం 2021 మేలో టెం డర్లను ఆహ్వానించి విక్రయించింది. దీంతో ప్రస్తు తం మార్క్‌ఫెడ్‌ వద్ద ఎలాంటి నిల్వలు లేవు. ప్రస్తు తం మక్కల నిల్వలు లేకపోయినా కొనుగోలుకు అవకాశం ఎందుకు ఇవ్వడం లేదన్నది ప్రశ్నార్ధ కంగా మారింది. దీంతో ఈ సారి మక్కల కొను గోలు ఉం టుందా లేదా అన్నది చర్చనీ యాంశంగా మారింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement