Saturday, April 27, 2024

50వ సీజేఐ చంద్రచూడ్‌.. రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణస్వీకారం

భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధనంజయ వై చంద్రచూడ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రెండేళ్లపాటు ఆయన సీజేఐ బాధ్యతల్లో కొనసాగుతారు. 10 నవంబర్‌ 2024 వరకు పదవిలో ఉన్న జస్టిస్‌ ఉదయ్‌ ఉమేష్‌ లలిత్‌ తర్వాత ఆయన సీజేఐ బాధ్యతలు చేపట్టారు. జస్టిస్‌ చంద్రచూడ్‌ మే 13, 2016న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 44 ఏళ్ల క్రితం సీజేఐ డీవై చంద్రచూడ్‌ తండ్రి జస్టిస్‌ వైవీ చంద్రచూడ్‌ కూడా భారత ప్రధాన న్యాయమూర్తి చేశారు. ఆయన అత్యధికంగా ఏడేళ్ల పాటు సీజేఐగా సేవలు అందించారు. తండ్రి తీర్పులను కూడా తిరగరాసిన ఘనుడిగా చంద్రచూడ్‌ గుర్తింపు పొందారు.

చంద్రచూడ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయోధ్య భూ వివాదం, గోప్యత #హక్కుతో సహా అనేక రాజ్యాంగ ధర్మాసనాలు, మైలురాయి తీర్పులలో ఆయన భాగమయ్యారు. సెక్షన్‌ 377, ఆధార్‌ చెల్లుబాటు, శబరిమల సమస్యపై పాక్షికంగా కొట్టివేయడం ద్వారా స్వలింగ సంబంధాలను నేరర#హతం చేయడం, నోయిడా ట్విన్‌ టవర్స్‌ కూల్చివేత, #హదియా కేసు వంటి వాటిలో విలక్షణ తీర్పులు ఇచ్చిన ధర్మాసనాల్లో ఆయన భాగమయ్యారు. కోవిడ్‌ సంక్షోభ సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల నుంచి ఉపశమనం పొందేందుకు జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం పలు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల, అతని నేతృత్వంలోని బెంచ్‌ మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ చట్టం పరిధిని విస్తరించింది.


హైవేలో నాణ్యతలోపం.. సారీ చెప్పిన కేంద్ర మంత్రి గడ్కరీ

జాతీయ రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, బహిరంగ క్షమాపణలు చెప్పారు. మధ్యప్రదేశ్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆ రాష్ట్ర హైవేపై ఒక చోట రోడ్డు అధ్వాన్నంగా ఉండటం పట్ల సారీ చెప్పారు. ఆ ప్రాజెక్టును కొత్త కాంట్రార్టర్‌కు అప్పగించినట్లు వెల్లడించారు. జబల్‌పూర్‌లోని మండలలో జరిగిన కార్యక్రమంలో రూ.1,261 కోట్ల విలువైన ఐదు జాతీయ రహదారుల ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.

- Advertisement -

‘నాకు బాధగా ఉంది. నేను చాలా విచారం వ్యక్తం చేస్తున్నా. పొరపాటు జరిగితే క్షమాపణ చెప్పడానికి నేను వెనుకాడను. మండల-జబల్‌పూర్ హైవేలో 63 కిలోమీటర్ల మేర బరేలా నుంచి మండలానికి రూ.400 కోట్లతో రహదారిని నిర్మించాం. అయితే దానిపై నేను సంతృప్తి చెందలేదు. మీలో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడకు రాక ముందే నా అధికారులతో మాట్లాడాను. ఆ కాంట్రాక్టర్‌ను తప్పించి కొత్తగా టెండర్‌ పిలవాలని చెప్పా. త్వరలో మంచి రోడ్డు అందుబాటులోకి వస్తుంది. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ఇబ్బందులకు నేను క్షమాపణలు కోరుతున్నాను’ అని అన్నారు. దీంతో ఆ సభకు హాజరైన ప్రజలు చప్పట్లతో గడ్కరీ నిజాయితీని అభినందించారు.

గవర్నర్‌ను తక్షణం తొలగించండి.. రాష్ట్రపతికి డీఎంకే లేఖ

తమిళనాడు అధికార పార్టీ డీఎంకే ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిపై తీవ్ర ఆగ్ర#హం వ్యక్తం చేసింది. ప్రశాంతతకు ముప్పుగా ఆయన్ను అభివర్ణించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రజలకు సేవలందించకుండా అడ్డుకుంటున్నారని మండిపడింది. ఆయనను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఓ వినతిపత్రాన్ని పంపించింది. ఆర్‌ఎన్‌ రవి గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించేటపుడు రాజ్యాంగాన్ని, చట్టాన్ని పరిరక్షిస్తానని, కాపాడతానని ప్రమాణం చేశారని, ఆ ప్రమాణాన్ని ఆయన ఉల్లంఘిస్తున్నారని వినతిపత్రంలో డీఎంకే ఆరోపించింది.

మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, శాసన సభ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపకుండా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని పేర్కొంది. ప్రభుత్వం పట్ల అసంతృప్తిని రగిలించే విధంగా మాట్లాడుతున్నారని, అటువంటి వ్యాఖ్యలను రాజద్రో#హంగా కొందరు పరిగణించే అవకాశం ఉందని తెలిపింది. రాజ్యాంగ పదవికి ఆయన అనర్హుడని పేర్కొంది. ఈ మెమెరాండంపై డీఎంకే అధిష్ఠాన వర్గం నేతలు, ఆ పార్టీ మిత్ర పక్షాల నేతలు సంతకాలు చేసినట్లు జాతీయ మీడియా కథనాలనుబట్టి తెలుస్తోంది. ఈ మెమొరాండంను ఈ నెల 2న రాసినట్లు సమాచారం. డీఎంకే ఇటీవల భావసారూప్యతగల ఎంపీలకు ఓ లేఖ రాసింది. రవిని గవర్నర్‌ పదవి నుంచి తొలగించాలనే తమ ప్రతిపాదనకు మద్దతివ్వాలని కోరింది.

వీసీగా కేరళ గవర్నర్‌ తొలగింపునకు ఆర్డినెన్స్‌.. ఆమోదించిన పినరయి మంత్రివర్గం

కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మ#హ్మద్‌ ఖాన్‌, సీఎం పినరయి విజయన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఆయన్ను యూనివర్సిటీ ఛాన్సలర్‌ పదవి నుంచి తొలగించాలని వామపక్ష ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రత్యేక ఆర్డినెన్స్‌కు కేరళ మంత్రివర్గం బుధవారం ఆమోదించింది. గవర్నర్‌ స్థానంలో నిపుణులైన విద్యావేత్తను రాష్ట్రంలోని యూనివర్సిటీలకు ఛాన్సలర్‌గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్‌ బిందు తెలిపారు. ఆర్డినెన్స్‌పై గవర్నర్‌ సంతకం చేస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు.

కాగా, కేరళలోని తొమ్మిది యూనివర్సిటీలకు ఛాన్సలర్‌గా ఉన్న గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌, ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని యూనివర్సిటీల వైస్‌ ఛాన్సలర్లను రాజీనామా చేయాలని ఆదేశించారు. దీంతో తొమ్మిది యూనివర్సిటీల వైస్‌ ఛాన్సలర్లు కేరళ #హకోర్టును ఆశ్రయించారు. గవర్నర్‌ ఆదేశాన్ని సవాల్‌ చేశారు. మరోవైపు ప్రభుత్వంతో సంబంధం లేకుండా గవర్నర్‌ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై సీఎం విజయన్‌ ప్రభుత్వం మండిపడుతోంది. ఈ నేపథ్యంలో వర్సిటీ ఛాన్సలర్‌ పదవి నుంచి ఆయనను తప్పించేందుకు ఒక ప్రత్యేక ఆర్డినెన్స్‌కు కేరళ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే గవర్నర్‌ ఆరిఫ్‌ మ#హ్మద్‌ ఖాన్‌ దీనిపై సంతకం చేస్తేనే అది అమలులోకి వస్తుంది.

అమెరికా ఎన్నికల్లో భారతీయం.. నలుగురు ఇండో-అమెరికన్ల గెలుపు
అమెరికా కాంగ్రెస్‌కు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ప్రవాస భారతీయులు సత్తా చాటారు. అధికార డెమొక్రాటిక్‌ పార్టీ నుంచి నలుగురు గెలుపొందారు. థానేదార్‌, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, ప్రమీలా జయపాల్‌ యుఎస్‌ ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. బుధవారం ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఖన్నా, కృష్ణమూర్తి, ప్రమీలా జయపాల్‌ వరుసగా నాల్గవసారి ఎన్నికల్లో పోటీచేశారు. భారత సంతతి నేతల్లో అత్యంత సీనియర్‌ అయిన అమీబెరా కాలిఫోర్నియాలోని 7వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి ప్రతినిధుల సభకు ఆరవసారి పోటీ చేశారు. ఆ స్థానంలో ఫలితం వెలువడాల్సి ఉంది. మరోవైపు టెక్సాస్‌ నుంచి పోటీచేసిన సందీప్‌ శ్రీవాస్తవ ఓటమి పాలయ్యారు. మాజీ కోలిన్‌ కౌంటీ న్యాయమూర్తి కీత్‌ సెల్స్‌ చేతిలో పరాజయం చెందారు. 33.19 కోట్ల అమెరికన్‌ జనాభాలో భారత సంతతి పౌరుల సంఖ్య కేవలం ఒక శాతం మాత్రమే. అయినా అగ్రరాజ్యంలో కీలక బాధ్యతల్లోకి దూసుకెళ్లడంలో ముందంజలో ఉంటున్నారు.

రాజకీయ నాయకుడిగా మారిన భారతీయ-అమెరికన్‌ వ్యవస్థాపకుడు, డెమొక్రాట్‌ నేత థానేదార్‌ మిచిగాన్‌ నుంచి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి రిపబ్లికన్‌ అభ్యర్థి మార్టెల్‌ బివింగ్స్‌ను ఓడించారు. 67 ఏళ్ల థానెదార్‌ ప్రస్తుతం మిచిగాన్‌ హౌస్‌లో మూడవ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.


అమెరికాలో తెలుగు మహిళ చరిత్ర. మేరీలాండ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అరుణా మిల్లర్‌

తెలుగు మహిళ అరుణా మిల్లర్‌ అగ్రరాజ్యంలో చరిత్ర సృష్టించారు. అమెరికాలోని మేరీలాండ్‌ రాష్ట్రానికి లెప్టిnనెంట్‌ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. భారతీయ సంతతికి చెందిన వ్యక్తి అక్కడ లెప్టిnనెంట్‌ గవర్నర్‌ కావడం ఇదే తొలిసారి. అరుణా మిల్లర్‌ వయసు 58 ఏళ్లు. ఆ రాష్ట్రం నుంచి వెస్‌ మూర్‌ డెమోక్రటిక్‌ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. గవర్నర్‌ తర్వాత అత్యున్నత హోదాలో లెప్టినెంట్‌ గవర్నర్‌ ఉంటారు. ఒకవేళ గవర్నర్‌ సరైన రీతిలో విధులు నిర్వర్తించలేని సమయంలో లెప్టిnనెంట్‌ గవర్నర్‌ ఆ బాధ్యతల్ని చూసుకుంటారు. మంగళవారం జరిగిన మధ్యంతర ఎన్నికల అనంతరం అరుణా మిల్లర్‌ విజయాన్ని ఖరారు చేశారు. మేరీలాండ్‌లో అరుణా మిల్లర్‌కు పాపులారిటీ ఎక్కువగా ఉంది.

రిపబ్లికన్‌ మద్దతుదారులు కూడా ఆమెకు సపోర్ట్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. అధ్యక్షుడు జో బిడెన్‌, ఉపాధ్యక్షురాలు హారిస్‌ కూడా మిల్లర్‌కోసం విస్తృత ప్రచారం నిర్వహించారు. విభజనకు బదులుగా ఐకమత్యాన్ని మేరీలాండ్‌ ఓటర్లు ఎంచుకున్నట్లు విక్టరీ ప్రసంగంలో అరుణా మిల్లర్‌ తెలిపారు. అరుణా మిల్లర్‌ హైదరాబాద్‌లో జన్మించారు. అరుణ ఏడేళ్ల వయసులో ఆమె తల్లిదండ్రులు అమెరికాకు వలస వెళ్లారు. 1972లో అమెరికా వచ్చానని, అప్పటి నుంచి అమెరికా కోసం పనిచేశానని ఈసందర్భంగా అరుణా మిల్లర్‌ చెప్పారు.

మంత్రి రాజీనామా.. సునాక్‌కు తలనొప్పులు

బ్రిటన్‌ ప్రధాని రిషిసునాక్‌ ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. తన సన్నిహిత మిత్రుడు ఒకరు కేబినెట్‌కు రాజీనామా చేయడం సునాక్‌ను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇప్పటి వరకు పోర్ట్‌ఫోలియో లేకుండా మంత్రిగా ఉన్న సర్‌ గావిన్‌ విలియమ్సన్‌, తోటి కన్జర్వేటివ్‌ పార్టీ స#హచరులు, సివిల్‌ సర్వెంట్‌ల పట్ల అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో ఆయన తన రాజీనామాను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. మిస్టర్‌ సునక్‌ విలియమ్సన్‌ రాజీనామాను చాలా బాధతో ఆమోదించారని, వ్యక్తిగత మద్దతు, విధేయతకి ధన్యవాదాలు అని ట్వీట్‌చేశారు.

కన్జర్వేటివ్‌ ప్రభుత్వాలకు, పార్టీకి మీ నిబద్ధత తిరుగులేనిది అని గావిన్‌ అన్నారు. అయినప్పటికీ, ప్రతిపక్షం ఈ ఎపిసోడ్‌ను సునాక్‌ అసమర్థ నాయకత్వంగా పేర్కొంది. లేబర్‌ పార్టీ నాయకుడు సర్‌ కైర్‌ స్టార్మర్‌ #హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో వారానికోసారి ప్రశ్నలు సంధిస్తూ ప్రధానిపై ఒత్తిడిని పెంచుతున్నారు. విలియమ్సన్‌ ప్రవర్తనపై వివాదం కొనసాగుతోంది.

సంజయ్‌ రౌత్‌కు బెయిల్‌.. మంజూరు చేసిన ముంబై కోర్టు

మనీలాండరింగ్‌ కేసులో శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌కు ముంబై స్పెషల్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. రౌత్‌తోపాటు ప్రవీణ్‌ రౌత్‌కు కూడా బెయిల్‌ ఇచ్చింది. దాంతో ఆయన మూడు నెలల తర్వాత బయటకు వచ్చారు. బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించాలన్న ఈడీ అభ్యర్థనలను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా ముకుళిత హస్తాలతో న్యాయమూర్తికి రౌత్‌ నమస్కరించారు. సంజయ్‌ రౌత్‌కి బెయిల్‌ లభించడం పట్ల ఆయన సోదరుడు స్పందించారు. ఇది మాకు ఎంతో సంతోషకరమైన రోజు. మా కుటుంబానికి పండుగరోజు. మేము కోర్టును నమ్మాం అని సందీప్‌ రౌత్‌ వ్యాఖ్యానించారు.

పాత్రా చావల్‌ ప్రాజెక్టు పునరుద్ధరణకు సంబంధించి వందకోట్ల మేరకు ఎంపీ సంజయ్‌ రౌత్‌ మనీలాండరింగ్‌కు పాల్పడ్డాడంటూ ఈడీ కేసు నమోదు చేసింది. ఆగస్టు 1న రౌత్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. తొలుత కస్టడీలోకి తీసుకోగా, ఆ తర్వాత న్యాయస్థానం జ్యుడిషియల్‌ కస్టడీకి అప్పగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement