Sunday, April 28, 2024

ఆన్‌లైన్‌ ఆర్డర్లలో తెలంగాణలో 40 శాతం వృద్ధి

హైదరాబాద్‌ : ఆన్‌ఆన్‌ ఆర్డర్లలో తెలంగాణ 2022 సంవత్సరంలో 40 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఫ్యాషన్‌, రకరకాల ఉపకరణాలు, విభాగంలో 50 శాతం, బ్యూటీ ఉత్పత్తులు, పర్సనల్‌ కేర్‌ వంటి వాటి విభాగంలో 20 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు యూనికామర్స్‌ అనే సంస్థ తెలిపింది. తెలంగాణ ఆధారిత వ్యాపారాలు ఆర్డర్‌, షిప్‌మెంట్‌ పరంగా 70 శాతం వృద్ధిని నమోదు చేశాయని తెలిపింది. ఇ-కామర్స్‌ ఆర్డర్లు తెలంగాణ నుంచి గణనీయంగా పెరుగుతున్నాయని యూనికామర్స్‌ తెలిపింది. ఆన్‌లైన్‌లో ఎక్కువ ఆర్డర్లు, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నుంచే ఉన్నాయి.

ఆన్‌లైన్‌ ఆర్డర్లలో అత్యధికంగా ఫ్యాషన్‌, ఉపకరణాల విభాగంలనే ఉన్నాయి. తెలంగాణలోని వ్యాపార సంస్థలు కూడా ఇ-కామర్స్‌ను ఆదరిస్తున్నాయని తెలిపిందది. యూనికామర్స్‌ సంస్థ తెలంగాణలోని 60కి పైగా కంపెనీలతో పని చేస్తున్నట్లు తెలిపింది. తెలం గాణ నుంచి వివిధ ప్రాంతాలకు షిప్పింగ్‌ చేసిన ఆర్డర్లలో 70 శాతం పెరుగుదల ఉంది. తెలంగాణలో ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వారి సం ఖ్య గణనీయంగా పెరుగుతున్నది. ఆధునిక సాంకేతిక అందుబాటులో ఉండటం, ఇ-కామర్స్‌ పట్ల అవగాహన ఎక్కువగా ఉన్నందునే ఆన్‌లైన్‌ ఆర్డర్లు పెరుగుతున్నాయని యూనికామర్స్‌ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement