Friday, March 29, 2024

టాటా మోటార్స్‌ లాభం 5,408 కోట్లు

టాటా మోటార్స్‌ 4వ త్రైమాసిక ఆర్ధిక ఫలితాలు ప్రకటిచింది. ఈ త్రైమాసికంలో కంపెనీ 5,407.8 కోట్ల రూపాయల నికర లాభాన్ని ప్రకటించింది. 2021-22 ఆర్ధిక సంవత్సరం కంపెనీ 1,032 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. 2022-23 మొత్తం ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం 35 శాతం వృద్ధితో 1,05,932 కోట్లుగా నమోదు చేసింది. టాటా మోటర్స్‌ తమ షేర్లు హోల్డర్లకు షేరకు 2 రూపాయల డివిడెండ్‌ ప్రకటించింది.

ఇండియన్‌ మార్కెట్లో బలమైన డిమాండ్‌, ధరల స్థిరికరణ వంటి వల్ల ఆదాయాలు పెరిగాయని తెలిపింది. చిప్‌ సప్లయ్‌ మెరుగుపడటంతో కంపెనీ ఉత్పత్తి పెరిగిందని, దీని వల్ల సేల్స్‌ మెరుగుపడ్డాయని పేర్కొంది. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ ఖర్చు 3 బిలియన్‌ డాలర్ల వరకు ఉంటుందని అంచనా వేసింది. ఇందులో 2 బిలియన్లు క్యాష్‌ కంపెనీ అమ్మకాల ద్వారా వస్తుందని, మరో 1 బిలియన్‌ డాలర్లను లోనుగా తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. నాలుగో త్రైమాసికంలో కంపెనీ 94,649 వాహనాలను విక్రయించింది. గత ఆర్ధిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే ఇది 24 శాతం ఎక్కువ.

Advertisement

తాజా వార్తలు

Advertisement