Thursday, May 2, 2024

IPL | ఒకే ఓవర్​లో 4 వికెట్లు ఫట్​.. 7 వికెట్ల తేడాతో గుజరాత్ విజయం

గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు తన ప్రత్యర్థి లక్నో సూపర్‌ జెయింట్స్‌ ముందు ఊరించే లక్ష్యాన్ని ఉంచింది. పిచ్‌ బ్యాటింగ్‌కు అంతగా అనుకూలించకపోవడంతో భారీ స్కోరు చేయలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు కేవలం 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో ముందు కేవలం 136 పరుగుల టార్గెట్​ మాత్రమే ఉంది. అయితే.. గుజరాత్‌ బ్యాటర్లతో ఓపెనర్‌ వృద్ధిమాన్‌ సాహా (47, 6 ఫోర్లు), కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (66, 4 సిక్సులు, 2 ఫోర్లు) మాత్రమే రాణించారు.

కానీ, ఈజీగా గెలవాల్సిన మ్యాచ్​ని లక్నో జట్టు చేజేతులారా పోగొట్టుకుంది. తక్కువ స్కోరే కదా.. సునాయసంగా విజయం సాధిస్తుందని అభిమానులు ఆశపడ్డారు. కానీ, గుజరాత్​ బౌలర్ల దెబ్బకు లక్నో  బ్యాటర్లు వరుసగా పెవిలియన్​కు చేరారు. 128 పరుగులు మాత్రమే చేశారు. ఒకే ఓవర్​లో నాలుగు వికెట్లు పడగొట్టిన గుజరాత్​ తన బౌలింగ్​ సత్తానికి చాటుకుంది. ఏడు వికెట్ల తేడాతో విజయం సొంతం చేసుకుంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement