Wednesday, March 29, 2023

రాష్ట్రంలో కొత్తగా 345 కరోనా కేసులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలో కొత్తగా 345 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8, 32, 219కు చేరింది. కరోనా నుంచి కోలుకోవడంతో 260 మందిని డిశ్చార్జి చేశారు. కరోనా బారిన పడడంతో హోం ఐసోలేషన్‌లో 2752 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 23, 780 కరోనా టెస్టులు చేయగా 345 కేసులు వెలుగు చూశాయి. జీహెచ్‌ఎంసీలో 146, మేడ్చల్‌ – మల్కాజిగిరిలో 17, నల్గొండలో 14, రంగారెడ్డిలో 32 కేసులు నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement