Friday, May 3, 2024

తెలంగాణాలో 34 ఐపీఎస్ పోస్టుల ఖాళీలు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో 34 ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. టీఆర్ఎస్ ఎంపీలు రంజిత్ రెడ్డి, వెంకటేష్ నేత, మాలోత్ కవిత, పసునూరి దయాకర్‌లు లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ మంగళవారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. రాష్ట్ర పోలీస్ సర్వీస్ నుంచి ఐపీఎస్‌ల నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు సమష్టిగా కృషి చేస్తున్నామని చెప్పారు.

గడిచిన ఐదేళ్లలో రాష్ట్ర పోలీస్ సర్వీస్ నుంచి ప్రమోషన్ల కింద 20 మంది ఐపీఎస్ అధికారులను నియమించామని ఆయన తెలిపారు. 2020 ఏడాదిలో సివిల్ సర్వీస్ పరీక్ష నుంచి ఐదుగురిని తెలంగాణ క్యాడర్‌కు కేటాయించినట్టు మంత్రి జవాబులో పేర్కొన్నారు. సివిల్ సర్వీస్ పరీక్ష ద్వారా ఎంపికయ్యే ఐపీఎస్ అధికారుల సంఖ్యను 150 నుంచి 200కు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనీ నిత్యానంద రాయ్ వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement