Monday, April 29, 2024

27మంది రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం..

ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన 27మంది రాజ్యసభ సభ్యులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు తన చాంబర్‌లో వారిచేత ప్రమాణం చేయించారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, టెక్స్‌టైల్స్‌ శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రమాణం చేసినవారిలో ఉన్నారు. రాజ్యాంగానికి కట్టుబడి పార్లమెంట్‌ సభ్యులుగా కర్తవ్యం నిర్వహిస్తామని వారు ఈ సందర్భంగా ప్రమాణం చేశారు. పది రాష్ట్రాలనుంచి ఎన్నికైన 27మంది కొత్త రాజ్యసభ సభ్యులు 9 భాషల్లో ప్రమాణం చేశారు.

12మంది హిందీ, నలుగురు ఇంగ్లీష్‌, సంస్కృతం, కన్నడ, మరాఠీ, ఒడియా భాషలలో ఇద్దరు చొప్పున, పంజాబీ, తెలుగు, తమిళ భాషల్లో ఒక్కొక్కరు ప్రమాణం చేశారు. కొద్దిరోజుల క్రితం నలుగురు కొత్త రాజ్యసభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయగా మరో 18 మంది చేయాల్సి ఉంది. ఈనెల 18న రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయాల్సి ఉన్నందున మిగతావారు కూడా ప్రమాణస్వీకారం చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. ప్రజాస్వామ్య సంప్రదాయాలను పాటిస్తూ, సభా గౌరవాన్ని పరిరక్షిస్తూ ప్రజాసమస్యల పరిష్కారం కోసం రాజ్యసభ వేదికగా పనిచేయాలని కొత్త సభ్యులకు మార్గదర్శనం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement