Sunday, April 28, 2024

262 మంది క్రీడాకారులు మృతి..

రష్యాపై యుద్ధానికి దిగిన ఉక్రెయిన్‌ పౌరుల్లో అనేకమంది క్రీడాకారులు కూడా ఉన్నారు. మాతృభూమి రక్షణ కోసం తుపాకీ పట్టిన ఆటగాళ్లు, యుద్ధక్షేత్రంలో అమరవీరులయ్యారు. దాదాపు 262 మంది క్రీడాకారులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ క్రీడాశాఖ వెల్లడించింది. దాదాపు 363 క్రీడా ప్రాంగణాలు ధ్వంసమైనట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌తోపాటు ఇతర ఏ పోటీల్లోనూ రష్యా క్రీడాకారులను అనుమతించొద్దని ఉక్రెయిన్‌ క్రీడామంత్రి వదిం హట్‌సెయిట్‌ డిమాండ్‌ చేశారు.

అంతర్జాతీయ పోటీల్లో తటస్థ అభ్యర్థులుగా రష్యాతోపాటు బెలారస్‌ ప్లేయర్లు పాల్గొనొచ్చని ఇటీవల ఇంటర్నేషనల్‌ ఒలింపిక్‌ కమిటీ నిర్ణయించింది. 2024 పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లో పాల్గొనే అంశంపై మాత్రం స్పష్టతఇవ్వలేదు. దీనిని ఉక్రెయిన్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. క్వాలిఫయింగ్‌ ఈవెంట్లలో రష్యాతో ఉక్రెయిన్‌ తలపడాల్సి వస్తే, తమను క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లకు అనుమతించొద్దని కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement