Friday, May 3, 2024

రికార్డు ధరకు సూర్య 42 డిజిటల్ రైట్స్..

కోలీవుడ్ స్టార్ సూర్య ప్రస్తుతం తన నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. సూర్య 42 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ కొనసాగుతుంది. సిరుత్తై శివ దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ నటి దిశా పటానీ కథానాయికగా నటిస్తొంది.

కాగా, ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటైన అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ పాన్-ఇండియన్ ఫిల్మ్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను రికార్డ్ ధరకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ కి ముందే ఇలాంటి న్యూస్ తో ఫ్యాన్స్ కు భారీ హైప్ ఎక్కిస్తోంది.


మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సూర్య 42 డిజిటల్ హక్కులు హిందీ భాష మినహా 80 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. కాగా, ప్రైమ్‌ వీడియోస్ లో తమిళ సినిమాకి ఇదే అతిపెద్ద డీల్. మొత్తంమీద, నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిన విజయ్ ‘లియో’ తర్వాత తమిళ సినిమాల్లో ఇది 2వ అతిపెద్ద డీల్.

Advertisement

తాజా వార్తలు

Advertisement