Monday, April 29, 2024

22న కలెక్టరేట్ ముట్టడి జయప్రదం చేయాలి


తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వర్ రావు
సంగారెడ్డి, నవంబర్ 10 ( ప్రభ న్యూస్): దేశంలో వ్యవసాయ కార్మిక రంగ సమస్యలను ప‌రిష్క‌రించాల‌ని భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ పిలుపు మేరకు ఈనెల 22న కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. బుధవారం సదాశివపేట లోని bkmu కార్యాలయంలో సంగారెడ్డి జిల్లా జిల్లా కార్యదర్శి తాజుద్దీన్ అధ్యక్షతన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన తాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దున్నేవాడికే భూమి ఇవ్వాలని వ్యవసాయ కూలీల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పరిష్కరించాలన్నారు. సెంటు భూమి లేని వ్యవసాయ కార్మికులకు రూ. ఐదు వేల పెన్షన్ మంజూరు చేయాలన్నారు. వ్యవసాయ కార్మికులు అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేయాలనిరాష్ట్ర‌ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పథకాలు రాకుండా కులాలకు పథకాలు కేటాయించడం కాకుండా పేద కుటుంబానికి ప్రతి పేదవాడికి వ్యవసాయ కార్మిక కుటుంబానికి రూ.10 లక్షల ప్రభుత్వ ఆర్థిక సాయం అందజేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, నాయకులు md. యాకుబ్ అలీ, లక్ష్మి, శంకరమ్మ, రియనా, సాధక్ అలీ, ముస్తఫా, md. రజియా బేగం, బాలరాజ్ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement