Sunday, May 5, 2024

పవన్ కళ్యాణ్ ‘ఖుషి’కి నేటితో 20 ఏళ్లు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ మూవీ ‘ఖుషి’. ఈ సినిమా విడుదలై నేటితో 20 ఏళ్లు నిండాయి. ఏప్రిల్ 27, 2001లో ఈ సినిమా విడుదలై పలు రికార్డులు సృష్టించింది. భూమిక హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి ఎస్.జె.సూర్య దర్శకత్వం వహించాడు. శ్రీ సూర్యా మూవీస్ బ్యానరుపై ఏ.ఎం.రత్నం ఈ మూవీని నిర్మించారు. దళపతి విజయ్ నటించిన తమిళ చిత్రం ‘ఖుషి’కి తెలుగు రీమేక్ ఇది. ఈ సినిమాలో పవన్ మ్యానరిజం, యాక్షన్, పాటలు, డైలాగులు ప్రతిదీ హైలైట్. ముఖ్యంగా భూమికతో పవన్ నటించిన నడుం సన్నివేశాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. అందునా ఆ బొడ్డు సన్నివేశం అసలే మరువరు. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద రూ.20 కోట్ల వసూళ్లతో ఈ సినిమా సంచలన విజయం సాధించింది. కాగా ఈ సినిమా కాస్ట్యూమ్స్‌ను పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ రూపొందించడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement