Thursday, May 16, 2024

17th, Lok Sabha – మ‌ళ్లీ క‌లుద్దాం! ఆఖ‌రి రోజు రాముని జ‌పం

సార్వ‌త్రిక ఎన్నిక‌లు జరగనున్న నేపథ్యంలో 17వ లోక్‌సభకు చివరి సమావేశం శ‌నివారం ముగిసింది. ప్ర‌ధాని మోదీ ప్ర‌సంగం అనంత‌రం లోక్ స‌భ‌ను నిర‌వ‌ధికంగా వాయిదా వేశారు. 17వ లోక్‌సభలో గత ఐదేళ్లలో మొత్తం 222 బిల్లులు ఆమోదం పొందినట్లు స్పీకర్‌ ఓంబిర్లా తెలిపారు. సమావేశాల చివరిరోజున రామమందిరం నిర్మాణంపై ప్రత్యేకంగా చర్చించారు. దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మాట్లాడారు. ప్రధాని మోదీ కూడా సభనుద్దేశించి ప్రసంగించారు. ఐదేళ్లలో సాధించిన విజయాలను ప్రస్తావించారు.

సమావేశాల ముగింపు సందర్భంగా ఓంబిర్లా మాట్లాడుతూ.. అధికార, విపక్ష బెంచ్‌లను సమానంగా చూశానని, సభా గౌరవం కాపాడేందుకు కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు..

17వ లోక్‌సభ విశేషాలివే..

2019లో లోక్‌సభ కొలువుదీరినప్పుడు 303 మంది సభ్యులతో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉంది. ప్రస్తుతం ఆ పార్టీ సంఖ్యా బలం 290కి తగ్గినా.. కాషాయ పార్టీకే అత్యధిక మెజార్టీ ఉంది.2019లో జాతీయ పార్టీల నుంచి 397 మంది ఎంపీలు ఎన్నికయ్యారు. వీరిలో కాంగ్రెస్‌ నుంచి 52 మంది గెలుపొందగా, ఇప్పుడా సంఖ్య 48కి తగ్గింది. తృణమూల్‌ కాంగ్రెస్‌కు 22, డీఎంకే 24 మంది సభ్యులున్నారు.ప్రస్తుత లోక్‌సభలో 70 ఏళ్ల పైబడినవారు తక్కువే. అత్యధిక ఎంపీలు 40 ఏళ్లలోపువారే. సభ్యుల సగటు వయసు 54 ఏళ్లుగా ఉంది.25 ఏళ్ల 11 నెలల వయసులో లోక్‌సభకు ఎన్నికైన బిజు జనతాదళ్‌ ఎంపీ చంద్రాణీ ముర్ము. ప్రస్తుత సభలో అతి చిన్న‌ వయస్కురాలిగా ఉన్నారు. ఇక.. ఎస్పీకి చెందిన 89ఏళ్ల షాఫిఖర్‌ రహ్మాన్‌ బర్క్‌ అతి పెద్ద వయస్కుడిగా ఉన్నారు.

260 మంది ఎంపీలు తొలిసారి ఎన్నికైనవారే. అయితే.. గత లోక్‌సభతో పోలిస్తే, మళ్లీ ఎన్నికైన వారి సంఖ్య కూడా పెరిగింది.17వ లోక్‌సభలో దాదాపు 400 మంది గ్రాడ్యుయేట్లు 2019లో 78 మంది మహిళా ఎంపీలు ఎన్నికవగా.. ఇప్పుడా సంఖ్య 77కు తగ్గింది. అయితే.. 16వ లోక్‌సభ (62 మంది)తో పోలిస్తే ఇది కాస్త ఎక్కువే.ఎంపీల్లో 39 శాతం మంది రాజకీయాలు, సామాజిక సేవను తమ వృత్తిగా చూపించారు. 38 శాతం మంది వ్యవసాయదారులు కాగా, 23 శాతం మంది వ్యాపారవేత్తలు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement