Friday, May 24, 2024

రష్యా దాడుల్లో 153 మంది చిన్నారులు మృతి..

రష్యా దాడుల్లో ఇప్పటి వరకు 153 మంది చిన్నారులు మరణించినట్లు ఉక్రెయిన్‌ ఆరోపించింది. 245 మంది చిన్నారులు గాయపడ్డారని తెలిపింది. ఫిబ్రవరి 24 నుంచి ఆరంభమైన రష్యా దురాక్రమణలో 400 మంది పిల్లలు ప్రభావితమయ్యారని ఉక్రెయిన్‌ మంత్రిత్వ శాఖకు చెందిన అధికారి పేర్కొన్నారు. రష్యా దాడుల్లో రాజధాని కీవ్‌ దద్ధరిల్లిందని, ఈ ప్రాంతంలో అత్యధికంగా 73 మంది పిల్లలు మరణించారని ప్రాసిక్యూటర్‌ జనరల్‌ తెలిపారు.

డొనెట్‌స్కీలో 65 మంది, ఖార్కివ్‌లో 46 మంది పిల్లలు చనిపోయారని చెప్పారు. రష్యా దళాలు స్వాధీనం చేసుకున్న మరియుపోల్‌, చెర్నిహవ్‌, లుహాన్స్క్‌ నగరాల్లో ఎంత మంది పిల్లలు మరణించారో తెలియలేదన్నారు. దీంతో పిల్లల మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందన్నారు. బాంబు దాడులు, కాల్పుల్లో ఇప్పటి వరకు 859 విద్యాసంస్థలు ధ్వంసమయ్యాయని తెలిపింది. ఇందులో 83 భవనాలు పూర్తిగా నేలమట్టమయ్యాయని పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement