Saturday, May 4, 2024

ప్రపంచ క్రికెట్ మొనగాడి ప్రస్థానానికి నేటితో 12 ఏళ్లు

ప్రస్తుతం ఉన్న ప్రపంచ క్రికెటర్లలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ నిస్సందేహంగా అత్యుత్తమ క్రికెటర్. టీమిండియాకు ఒకప్పుడు సచిన్ ఎలాగో.. ఇప్పుడు కోహ్లీ అలాగన్నమాట. అన్ని ఫార్మాట్లలో తానేంటో కోహ్లీ ఇప్పటికే నిరూపించుకున్నాడు. కెప్టెన్‌గానూ తన మార్క్ చూపిస్తున్నాడు. అయితే కెప్టెన్‌గా అతడు సాధించాల్సినది చాలా ఉందనేది దిగ్గజాల మాట. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌‌లోకి రంగప్రవేశం చేసి 12 ఏళ్లు అవుతున్నాయి. సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇదే రోజు(2008 ఆగస్టు 18) కోహ్లీ కల నెరవేరింది. దంబుల్లాలో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో బరిలోకి దిగిన కోహ్లీ ఆ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. గంభీర్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన విరాట్ కేవలం 12 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. కాకపోతే ఆ సిరీస్‌లో నాలుగో మ్యాచ్‌లో కోహ్లీ అర్ధ శతకంతోనే టోర్నీ భారత్‌ సొంతమైంది.

కాగా కోహ్లీ ఇప్పటివరకు 94 టెస్టులు, 254 వన్డేలు, 90 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 27 సెంచరీలు, వన్డేల్లో 43 సెంచరీలు చేసి సచిన్ తర్వాత 100 సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే గత రెండేళ్లుగా కోహ్లీ ఖాతాలో సెంచరీ లేదంటే మీరు నమ్మగలరా? అనుష్కశర్మతో వివాహం అయిన నాటి నుంచి కోహ్లీ బ్యాటింగ్‌లో పదును తగ్గిందన్న విమర్శకుల నోళ్లను అతడు మూయించాల్సి ఉంది. తాజా ఇంగ్లండ్ పర్యటనలోనైనా సెంచరీ బాది మునుపటి ఫామ్‌ అందుకోవాలని భారత అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: కోహ్లీ సేన దూకుడులో తప్పేమీ కనిపించడం లేదు: జో రూట్

Advertisement

తాజా వార్తలు

Advertisement