Friday, May 3, 2024

హీరోగా మ్యూజిక్ డైరెక్ట‌ర్ కోటి త‌న‌యుడు – మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ చేసిన రానా

సంగీత ద‌ర్శ‌కుడు కోటి కుమారుడు హీరోగా వెండితెర‌కి ప‌రిచ‌యం కానున్నాడు. రాజీవ్ సాలూరు హీరోగా 11:11 అనే సినిమా రూపొందింది. వీరేశ్ నిర్మించిన ఈ సినిమాకి కిట్టూ నల్లూరి దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ సినిమా నుంచి హీరో రానా చేతుల మీదుగా మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. హీరోగా రాజీవ్ లుక్ బాగుంది. ఈ సినిమాతో తెలుగు తెరకి వర్ష విశ్వనాథ్ కథానాయికగా పరిచయమవుతోంది. ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఆయన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. సంగీతం నేపథ్యంగా ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన కోటి తనయుడుని ప్రేక్ష‌కులు ఏ మేర‌కు ఆద‌రిస్తారో చూద్దాం.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement