Tuesday, April 30, 2024

వోడాఫోన్‌ ఐడియా ద్వారా 10వేల ఉద్యోగాలు

ప్రముఖ టెలికం సంస్థ వోడాఫోన్‌ ఐడియా (వీఐ)అతి పెద్ద ఎంప్లాయిమెంట్‌ ప్లాట్‌ఫామ్‌ అప్నా భాగస్వామ్యంతో వీఐ యాప్‌లో జాబ్స్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ద్వారా 10వేల అంతర్జాతీయ ఉద్యోగాలు కల్పించనుంది. యూఏఈ, జపాన్‌, మలేషియా, రష్యా, జర్మనీ, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, కెనడా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ వంటి దేశాల్లో తయారీ, సేల్స్‌, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌, కస్టమర్‌ కేర్‌, లాజిస్టిక్స్‌ వంటి రంగాల్లో ఉద్యోగాల కోసం ధరఖాస్తు చేసుకోవాలని వీఐ కోరింది. అభ్యర్ధులు గ్రాడ్యుయేషన్‌, ఐటీఐ, ఇతర స్పెషలైజ్‌ డిప్లామా కలిగి ఉండాలని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement