Saturday, May 4, 2024

10ల‌క్ష‌ల ఉద్యోగాలు-మ‌రో 10ల‌క్ష‌ల ఉపాధి అవకాశాలు-సీఎం నితీశ్ కుమార్ ప్ర‌క‌ట‌న‌

తాము అధికారంలోకి వ‌స్తే 10ల‌క్ష‌ల ఉద్యోగాల‌ను క‌ల్పిస్తామ‌ని గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో తేజ‌స్వి యాద‌వ్ హామీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన డిప్యూటీ ఆకాంక్షను నెరవేర్చేలా సీఎం నితీశ్ కుమార్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారీ హామీ ఇచ్చారు. తమ సంకీర్ణ ప్రభుత్వ ఆకాంక్ష మేరకు 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు… మరో 10 లక్షల ఉపాధి అవకాశాలను కల్పిస్తామని చెప్పారు. ఉద్యోగాల కల్పన కోసం తాము పెద్ద ఎత్తున కృషి చేస్తామని తెలిపారు. సీఎం ప్రకటనపై తేజస్వి స్పందిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అతి పెద్ద ప్రకటన చేశారన్నారు. సీఎం హామీని నెరవేర్చేందుకు రెండు పార్టీలు కలిసికట్టుగా పని చేస్తాయని తెలిపారు. మొన్నటి వ‌ర‌కు బీహార్ లో రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న జేడీయూ అధినేత నితీశ్ కుమార్, ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ లు ఇప్పుడు ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇటీవలే ఇద్దరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నితీశ్ సీఎంగా, తేజస్వి డిప్యూటీ సీఎంగా పాలన పగ్గాలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement