Sunday, May 5, 2024

హైదరాబాద్ : జనం మదిలో చెరగలి ముద్ర – సీఎం అంటే కేసీఆరే!

  • ఆంధ్రప్రభ దినపత్రిక పేజ్ వన్ స్పెషల్ స్టోరీ
  • పదేళ్ల ప్రకటనతో ప్రజల్లో ఆనందం
  • తేటతెల్లమైన ఆరాధనా భావం
  • నేడు హరితవనంలా నాటి ఎడారి తెలంగాణ
  • కాలుష్య నియంత్రణలోనూ దేశానికి దిక్సూచి
  • ఆరున్నరేళ్లలో అద్భుత ప్రగతి
  • కేసీఆర్‌ అకుంటిత దీక్షతోనే సాధ్యం
  • పదేళ్ల తర్వాతా తెరాసదే విజయం
  • స్పష్టం చేసిన గులాబీ దళపతి
  • కేసీఆర్‌ అభిమానుల్లో ఉంపొంగే ఉత్సాహం
  • విపక్షాల్లో అలుముకున్న నిర్వేదం

జనం నాడి పట్టి… ఉద్యమానికి సారధ్యం వహించి… బలిదానానికీ సిద్ధపడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన జనజ్జేత ఆయన… అధికారం చేపట్టిన ఆరేళ్లలోనే తెలంగాణను రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా మార్చిన విశిష్ట ఘనుడాయన… ఎంతో దూరదృష్టితో సాగునీటి పథకాలను రచించి, నిర్మించి దక్కను పీఠ భూముల్ని ఆప్యాయంగా తడిపిన ఆరాధ్యుడాయన… కష్టకాలంలో మరో పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని, పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యతను వివరించిన విజ్ఞుడాయన… కుట్ర రాజకీయాలను ఒంటిచేత్తో దునుమాడి ప్రగతిబాటలు పరుస్తున్న అభినవ సవ్యచాచి ఆయన…

తెలంగాణ రాష్ట్రంలో గతకొన్ని రోజులుగా ముఖ్యమంత్రి మార్పు ఉంటుందన్న వార్తలు మీడియాలోనూ, సోషల్‌ మీడియాలోనూ చక్కెర్లు కొడుతున్నాయి. దీనిపై సీఎం కేసీఆర్‌ లేదా పార్టీ ప్రతినిధులెవరూ ఇంతవరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కానీ ఆదివారం జరిగిన టీఆర్‌ఎస్‌ విస్తృత సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నాయకులు అందరూ ఉండగా తానే మరో పదేళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగుతా నని, ఆ తర్వాత కూడా టీఆర్‌ఎస్‌ అధికారం లో ఉంటుందంటూ కేసీఆర్‌ స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో అధికార మార్పులపై ఎలాంటి ఆశలెట్టుకోవద్దని విపక్షాలకు హితవు పలికారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో తాననుకున్నది సాధించేవరకు విశ్రమించేది లేదని తేల్చిచెప్పేశారు. తనకు ఆరోగ్యం అన్ని విధాలా బాగుందన్నారు. సామర్థ్యానికి ఎలాంటి లోటు లేదన్నారు. ఈ ప్రకటనతో తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది. తెలంగాణలో ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను తప్ప మరెవర్నీ జనం ఊహించలేక పోతున్నారు. ఆయన తప్ప మరెవరూ అంతటి సమర్ధతతో పాలించలేరన్న భావనకొచ్చేశారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పిడి ప్రచారంతో తెలంగాణ జనంలో నిస్సత్తువ ఆవరించింది. వారికి కేసీఆర్‌ తాజా ప్రకటన బూస్ట్‌ల పని చేస్తోంది. కోవిడ్‌ పట్ల భయంతో సతమతమౌతున్న వ్యక్తికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ దొరికి ఉపశమనం లభించిన తీరులో తెలంగాణ ప్రజల్లో కేసీఆర్‌ ప్రకటనలు ఆనందపు జల్లులు కురిపించాయి. ఈ ఒక్క ప్రకటన తిరిగి రాష్ట్రంలో కేసీఆర్‌ పట్ల ప్రజల్లో ఉన్న ఆరాధన భావాన్ని తేటతెల్లం చేసింది. గత ఆరేడేళ్ళలో తెలంగాణ ప్రాంత రూపురేఖలు మారిపోయాయి. విభజన నాటికి ఎడారిగా ఉన్న తెలంగాణ ప్రాంతం ఇప్పుడు హరితవనంలా మారింది. ఖాళీ ప్రదేశాలు సామాజిక అడవులుగా రూపాంతరం చెందాయి. ఆరేళ్ళలో ఇంతటి ప్రగతి సాధించిన రాష్ట్రం భారత్‌లో మరేదీలేదు. ముఖ్యంగా అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముందడుగేసింది. ఇంతవరకు సీఎం మార్పు ఉంటుందని కేసీఆర్‌ను తప్పించి రాష్ట్ర ప్రజలు మరెవర్నీ ఆమోదించే అవకాశాల్లేవని, కేసీఆర్‌కు తప్పనిసరి పరిస్థితి వచ్చి తనంతతానే మార్పు కోరుకుంటే ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే ఈ రాష్ట్రాన్ని పాలించగలరని కేసీఆర్‌ అభిమానులు భావించారు. దీనిపైనే విస్తృతంగా ప్రచారం సాగింది. ఈ దశలో కేసీఆర్‌ తన నిర్ణయాన్ని గంటాపథంగా ప్రకటించారు. తనదైన శైలిలో రాష్ట్ర, దేశ ప్రజలకు భవిష్యత్‌ కార్యాచరణను తేల్చిచెప్పారు. పదేళ్ళ పాటు తాను ముఖ్యమంత్రిగా ఉండడంతో పాటు ఆ తర్వాత కూడా రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే కొనసాగుతుందని నిర్ద్వందంగా ప్రకటించారు. ఒకట్రెండు విజయాలతో ఉప్పొంగిపోవద్దంటూ ప్రతిపక్షాలకు హెచ్చరికలు జారీ చేశారు. అసెంబ్లిd ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి తమ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకోగలిగే సత్తా, సామర్థ్యాలు తనకున్నాయని తేల్చేశారు. దీంతో కేసీఆర్‌ అభిమానుల్లో ఆనందం ఉప్పొంగుతుంటే విపక్షంలో మాత్రం నిర్వేదం చోటు చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement