Friday, May 3, 2024

పట్నా : ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ కరోనా ఉచిత వ్యాక్సిన్

దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. తొలి విడతలో కోవిడ్ వారియర్లకు మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారు. ఇప్సేడే 60 ఏళ్లకు పైబడిన వారందరికీ ఈరోజు నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ ను ఉచితంగా వేస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ వేయించుకోవాలనుకునే వాళ్లు మాత్రం రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఈ విషయంలో  బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు.  అందరికీ వ్యాక్సిన్ ను ఉచితంగా అందిస్తామని నితీశ్ చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వ్యాక్సిన్ ను ఉచితంగా ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా వ్యాక్సినేషన్ వేయించుకునే వారు కూాడే రూ. 250 చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. బీహార్ ఎన్నికల ప్రచార సమయంలో రాష్ట్ర ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా అందిస్తామని నితీశ్ హామీ ఇచ్చిన సంగతి విదితమే. ఇచ్చిన హామీ మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement