Tuesday, April 30, 2024

ఫొటోగ్రాఫర్ ని వారించిన ‘అర్జున్ కపూర్’

ఓ ఫొటోగ్రాఫర్ అత్యూత్సాహం బాలీవుడ్ నటులను ఇబ్బంది పెట్టిందట. 2018లో బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్, మలైకా అరోరా డేటింగ్ చేస్తున్నారు. వీరిద్దరూ బహిరంగంగానే కలిసి తిరుగుతుంటారు. తాజాగా వీరిద్దరూ బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ఇంటికి విచ్చేశారు. కరీనా ఇటీవల ఓ పండంటి మగబిడ్డకు జన్మినిచ్చింది. ఈ నేపథ్యంలో ఆ చిన్నారిని చూసేందుకు అర్జున్, మలైక ముంబైలోని సైఫ్ ఇంటికి వెళ్లారు. ఒకే కారు నుంచి దిగిన వీరిద్దరినీ కెమెరాల్లో బంధించేందుకు ఫొటోగ్రాఫర్లు పోటీ పడ్డారు. ఓ ఫొటోగ్రాఫర్ అయితే ఏకంగా సైఫ్ ఇంటి గోడ కూడా ఎక్కేశాడు. అతనిని చూసిన అర్జున్ అసహనం వ్యక్తం చేశాడు. `ఇది చాలా పెద్ద తప్పు. ముందు గోడ దిగండి. ఇంటి గోడలు ఇలా ఎక్కకూడదన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement