Monday, April 29, 2024

అమరావతి : నేడూ, రేపూ వర్షాలు

ఉత్తర కోస్తా ఆంధ్రా, దాని పరిసర ప్రాంతాలలో 1.5 కిలోమీటర్ల ఎత్తు నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. శ్రీలంక తీరం నుండి ఉత్తర తమిళనాడు తీరప్రాంతం వరకు ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద తక్కువ ఎత్తులో వీచే తూర్పు గాలులలో ఉపరితల ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణంలో మార్పులు ఏర్పడనున్నాయి. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాంలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. శనివారం నాడు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉందని, ఆదివారం ఉత్తర కోస్తా ఆంధ్రాలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉందని, శనివారం నాడు దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తాఆంధ్రాలో ఆదివారం, ఆ తర్వాత తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం నుంచి పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉత్తర కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు, దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా ఏపిపై ఏపీపై ఉపరితల ఆవర్తన ప్రభావం పడింది. ఇప్పటికే ఏపి లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో శుక్రవారం సాయంత్రం చిరుజల్లులు కురవగా గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఇక హైద్రాబాద్‌లో శుక్రవారం వేకువజామున, సాయంత్రం పలు చోట్ల భారీ వర్షం కురిసంది. తెలంగాణ జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఏపి లోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో పంటలు చేతికి అందివచ్చే సమయం కావడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. తేలికపాటి జల్లులు అయితే సమస్య లెదని భారీ వర్షాలు పడితే ఇబ్బందులు తప్పవంటు-న్నారు. ఏపి వ్యాప్తంగా పలుచోట్ల రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. తెలుగు రాష్ట్రాల్ల్రో ఉన్నట్టు-ండి ఇలా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement