Tuesday, April 16, 2024

ఏకకాలంలో మొదటి, రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌

రాష్ట్రంలో కరోనా మొదటి, రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌ ఏకకాలంలో కొనసాగుతోంది. ఓవైపు ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సిబ్బందికి రెండో డోస్‌ ఇస్తూనే మిగిలిపోయిన ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కి మొదటి డోస్‌ను కూడా ఇస్తున్నారు. కరోనా సెకండ్‌ డోస్‌ టీకా కార్యక్రమలో భాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 12,668 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ జి.శ్రీనివాస్‌ తెలిపారు. ఏ ఒక్కరిలోనూ సైడ్‌ ఎఫెక్టులు తలెత్తలేదని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సిబ్బంది 3,31,097 మంది ఉండగా, మొదటి డోస్‌ని 1,93,486 మంది తీసుకున్నట్లు వెల్లడించారు. అదే విధంగా 2,57,239 మంది ఫ్రంట్‌వర్కర్స్‌కు మొదటి డోస్‌లో 86,997 మంది తీసుకున్నట్లు వెల్లడించారు. శుక్రవారం కూడా 5585 మందికి మొదటి డోస్‌ వేసినట్లు వెల్లడించారు. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఏడు రాష్ట్రాల్లో 61శాతం మందికి కరోనా రెండో డోస్‌ను ఇచ్చారు. ఆ ఏడు రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement