Monday, April 29, 2024

అమరావతి : అవరోధాలను అధిగమిస్తూ….!

ప్రతి ఇంటికి నాణ్యమైన బియ్యం వాహనాల ద్వారా సరఫరా కార్య క్రమం ప్రారంభదశలో కొన్ని అవరోధాలు ఎదురైనప్పటికీ ముఖ్య మంత్రి చొరవతో అన్ని అవరోధాలను అధిగమిస్తున్నా మని, పోరసరఫరాలశాఖ కమిష నర్‌ కోన శశిధర్‌ గురువారం తెలి పారు. తొలుత తలెత్తిన సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తూ ఈ పంపిణీ కార్యక్రమాన్ని పట్టణ ప్రాంతాలలో విజయవంతంగా నిర్వహిస్తున్నా మన్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత ప్రతిష్టవంతం గా అమలు చేసేందుకుగాను పలు నిర్ణయాలు తీసుకు న్నామని, ఇప్పటి వరకు వాహనాల ద్వారా పట్టణ ప్రాంతాల్లో 15 లక్షల మందికి సరుకులు పంపిణీ చేశా మని కమిషనర్‌ తెలిపారు. ప్రతి జిల్లాలో మండల, డివిజన్‌, జిల్లా స్థాయి కోర్డినేషన్‌ కమిటీ-ల ద్వారా ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షణ జరుపు కుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహి సున్నామని కమిషనర్‌ ప్రకటనలో పేర్కోన్నారు.
పట్టణ ప్రాంతాలలో 2067 మొబైల్‌ వాహనాలను మంజూరు చేయుట జరిగిందని, ప్రతి మొబైల్‌ వాహ నం ద్వారా నిత్యావసర సరుకులను కార్డుదారులకు ప్రతి రోజు ఉదయం 08:00 గంటల నుండి పంపిణీ చేయుట జరుగుతుందని తెలిపారు. పంపిణీ ప్రారం భంనకు ముందుగానే అనగా ఉదయం 07:00 గంటలకు మొబైల్‌ ఆపరేటర్‌, సహాయకుడు సంబం ధిత చౌకదుకాణం నుండి ఆ రోజున పంపిణీ చేయు టకు అవసరమైన బియ్యం, ఇతర నిత్యావసర సరుకు లను చౌకధరల దుకాణదారుని బస్తాల వారీగా తూ కం వేసుకొని తీసుకొనుట జరుగుతుందని తెలిపారు.
ప్రతి మొబైల్‌ వాహనం అన్ని వీధులలో ఖచ్చి తంగా తిరిగేలా ఆదేశాలు ఇచ్చామని, కార్డుదారులు క్యూలో నిలబడవలసిన అవసరం లేదని, మొబైల్‌ వాహనాలు ప్రతి ఇంటి వద్దకు వెళ్తూ మైకుల ద్వారా తెలియచేస్తూ, పారదర్శకంగా సరుకులు పంపిణీ చేయవలసిందిగా ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రస్తు తం పట్టణ ప్రాంతాల్లో సుమారు 27 లక్షల మంది కార్డుదారులు నిత్యావసర సరుకులు పొందుచున్నా రని, వారిలో ఇప్పటి వరకు 15 లక్షల మంది మొబైల్‌ వాహనం ద్వారా సరుకులను తీసుకున్నారని తెలి పారు. మిగిలిన కార్డుదారులకు నిర్దిష్ట సమయంలో అనగా వచ్చే వారం రోజులలో పంపిణీ పూర్తిచేయుట జరుగుతుందని, ప్రతి మొబైల్‌ వాహనమునకు మ్యాపింగ్‌ చేసిన కీ రిజిస్టర్‌ అనుసారంగా వార్డు వాలంటీ-ర్‌ వారి పరిధిలో ఉన్నటు-వంటి కార్డుదారు లకు మొబైల్‌ వాహనం వచ్చు తేదిని ముందుగానే సూచించవలసినదిగా వారికి ఆదేశాలు జారీ చేశామ న్నారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ లేని కాలనీలు, ప్రాంతాలలో కార్డుదారులకు సజావుగా పంపిణీ చేసేందుకు, ప్రతి వాహనం నందు ఈ-పాస్‌ యంత్రాలకు ఆఫ్‌ లైన్‌ విధానం కూడా అమలుచేయుట జరిగిందని తెలిపా రు. కార్డుదారుల ఇంటి వద్దకు వాహనం వచ్చిన సమ యంలో రేషన్‌ పొందలేకపోయిన కార్డుదారుల సౌక ర్యార్ధం పంపిణీ ముగిసిన తరువాత వాహనాన్ని సంబంధిత సచివాలయం వద్ద ప్రతి రోజు సాయం త్రం 06:00 గంటల నుండి 07:00 గంటల వరకు ఉంచి సదరు కార్డుదారులకు సరుకులు పొందు అవ కాశం కల్పించామని, అలాగే వేరొక్‌ క్లస్టర్‌లో పంపిణీ జరుగు సమయంలో కూడా వాహనం వద్దకు వెళ్లి సరుకులు పొందుటకు కూడా అవకాశం కల్పించుట జరిగిందని తెలిపారు.
వేరొక మునిసిపాలిటి లేదా మండలం లేదా జిల్లా నందు మొబైల్‌ వాహనమునకు అనుసంధానం అయిన కార్డుదారులు అనుకోకుండా ప్రస్తుత మునిసి పాలిటి లో సరుకులను పొందదలచినచో అట్టి కార్డు దారులకు పోర్టబిలిటీ- విధానం ద్వారా సమీప చౌక దుకాణం నుండి ఉదయం 08:00 గంటల లోపు, సాయంత్రం 07:00 గంటల తరువాత సరుకులను తీసుకొనే సౌకర్యం కల్పించామని, ఇది ప్రత్యేకంగా వలస కూలీల సౌకర్యార్ధం కల్పించామని తెలిపారు. అలాగే వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కార్డు క్రింద ఇతర రాష్ట్రాల్రకు సంబంధించిన కార్డులు కుడా సమీప చౌక దుకాణం నందు పోర్టబిలిటీ- ద్వారా సరుకులను పొందే అవకాశం ఉందని కమిషనర్‌ శశిధర్‌ ప్రకటనలో పేర్కోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement