Thursday, April 25, 2024

కొత్త స్ట్రెయిన్‌పై పనిచేయని టీకా

ఆక్స్‌ఫర్డ్‌- ఆస్ట్రాజెనికా కోవిడ్‌ 19కోసం తయారు చేసిన వ్యాక్సిన్‌ ప్రభావం కొత్త వైరస్‌పై అంతంత మాత్రంగానే ఉంటుం దని నిపుణులు పేర్కొంటున్నారు.ఈ వ్యాక్సిన్‌ ప్రభావం కొత్త వైరస్‌పై మందకొ డిగానూ, స్వల్పంగానూ, ఓ మాదిరిగా నూ పనిచేస్తుందని నిపుణులు పేర్కొన్నా రు. కొత్తవైరస్‌ ముందుగా దక్షిణాఫ్రికాలోనే బయట పడింది. ఈ వైరస్‌ 2000 మందికి పైగా సోకినప్పటికీ, వ్యాధి సోకిన వారెవరూ మరణించడం కానీ, ఆస్ప త్రుల్లో చేరడం కానీ జరగలేదని అధికారులు తెలిపా రు. కొత్తవైరస్‌ పై ఈ వ్యాక్సిన్‌ ప్రభావం గురించి ఇంకా అధ్యయనాలు జరుగుతున్నాయి. ఈలోగా కరోనా వైరస్‌కు అనేక వ్యాక్సిన్‌లు వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. క్లినికల్‌ ట్రయిల్స్‌లోనూ, బయట వ్యక్తు లపైనా ఈ వ్యాక్సిన్‌ ప్రభావం స్వల్పంగానే ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. 501వై.వి-2వైరస్‌ వేరియంట్‌ దక్షిణాఫ్రికాలో ఎక్కువగా ఉందని అధ్య యనంలో వెల్లడైనట్టు ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పేర్కొంది. కరోనా కట్టడికి తయారుచేసిన వ్యాక్సిన్‌ రెండుడోస్‌ లు తీసుకోవల్సి ఉంది. ఈ రెండు డోస్‌ల ప్రభావం కొత్త వైరస్‌పై ఎక్కువగా కనిపించలేదని నిపుణులు వివరించారు. కొత్త వేరియంట్‌ వైరస్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోనూ, దక్షిణాఫ్రికాలోనూ ఎక్కువగా వ్యాపించింది. అయితే, కోవిడ్‌ -19 నివారణకు ఈ వ్యాక్సిన్‌లు బాగా పనిచేస్తున్నాయి. రోగులకు పూర్తి రక్షణ ఇస్తున్నాయి. దక్షిణాఫ్రికా వేరియంట్‌ వైరస్‌ని కట్టడి చేయడానికి తమ సంస్థ మరింత సమర్ధవంత మైన వ్యాక్సిన్‌ను తయారు చేయనున్నదని మొడెర్నా ప్రకటించింది. ఈ కొత్త వ్యాక్సిన్లతో లాబ్‌లలో ట్రయి ల్స్‌ చేయిస్తున్నట్టు పేర్కొంది. అయితే, కొత్తవైరస్‌పై తమ సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్‌ల ప్రభావం తక్కువగా ఉందని వివరించింది. 501 వై.వి2 మ్యూ టేషన్లపై తమ వ్యాక్సిన్‌ ప్రభావం తక్కువగా ఉందనీ బయోన్‌ టెక్‌ ఫైజర్‌ కంపెనీ కూడా అంగీకరించింది. ఆక్స్‌ఫర్డ్‌- ఆస్ట్రాజెనికా అధ్యయనం చిన్న శ్యాంపిల్స్‌ లో జరిగింది. హెచ్‌ ఐవి నెగిటివ్‌ సోకినవ్యక్తులు 31 మంది నుంచి శ్యాంపిల్స్‌ తీసి పరిశోధనలు జరిపిన ట్టు తెలిపింది. వీరిలో సగం మందిపై తమ వ్యాక్సిన్‌ ప్రభావం చాలా తక్కువగా ఉందని పేర్కొంది. ఈ వ్యాక్సిన్‌లు ఆస్పత్రులలో చికిత్స బెడదను చాలా వరకూ తగ్గిస్తున్నాయని ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య రంగ నిపుణులు పేర్కొంటున్నారు. లాక్‌ డౌన్‌లు, కర్ఫ్యూ వంటి వాతావరణాల నుంచి ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చేందుకు కొంతవరకైనా ఈ వ్యాక్సిన్‌లు పని చేస్తా యని ఆయన అన్నారు. ఇన్ఫెక్షన్‌ లక్షణాల నుంచి రక్షణకు,ఆస్పత్రులలో చేరే పరిస్థితిని నివారించేందు కు ఈ వ్యాక్సిన్‌ లు పనిచేస్తాయని చెప్పారు. తీవ్రమైన అస్వస్థతల నుంచి రక్షణకు ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ ఉప యోగ పడేందుకు వీలుగా దీనిని తీర్చి దిద్దుతున్నట్టు ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ కార్యక్రమం పరిశోధకురాలు సరాహ్‌ గిల్‌ బ్రెట్‌ తెలియజేశారు. ఇతర వ్యాక్సిన్‌ తయారీదారులు ఇతర వేరియంట్‌ వైరస్‌ల విషయం లో తమ వ్యాక్సిన్‌ సామర్ధ్యం విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం లేదేమోననిపిస్తోందనీ, తాము అలా కాకుండా వైరస్‌ రకాలన్నింటిపై వ్యాక్సిన్‌ ప్రభా వవంతంగా పని చేసేందుకు వ్యాక్సిన్‌ను అభివృద్ధి పరుస్తున్నామని గిల్‌ బ్రెట్‌ చెప్పారు. ఏ వైరస్‌ సోకినా ఆస్పత్రుల్లో చికిత్స, మరణాలు సంభవించకుండా రక్షించేందుకు తమ వ్యాక్సిన్‌ సమర్ధవంతంగా పని చేస్తుందని చెప్పారు. కొత్త వైరస్‌ గురించి ఆస్ట్రాజెనికా మొదట వ్యాఖ్యానించలేదు.తర్వాత దక్షిణాఫ్రికా వేరియంట్‌ వైరస్‌పై అధ్యయనం తర్వాత వ్యాఖ్యాని స్తూ, వైరస్‌ ప్రభావం తీవ్రతను తగ్గించేందుకు తమ వ్యాక్సిన్‌ బాగా పని చేస్తుందనీ, అయితే, కొత్త వైరస్‌పై వ్యాక్సిన్‌ ప్రభావం అంతంత మాత్రంగానే ఉంటుంద ని పేర్కొంది.యాంటీ బాడీ కార్యకలాపాలను తటస్థీక రించేందుకు, రోగ తీవ్రతను తగ్గించేందుకు తమ వ్యాక్సిన్‌ పనిచేస్తుందని ఆస్ట్రాజెనికా పేర్కొంది. ఇతర కోవిడ్‌ -19 వ్యాక్సిన్‌లు తీవ్ర రోగాలపై ప్రభావం చూపుతాయని పేర్కొంటున్నాయనీ, తమ వ్యాక్సిన్‌ గురించి మాత్రం అలాంటి హామీని ఇవ్వడం లేదని వివరించింది.దక్షిణాఫ్రికాతో సహా ప్రపంచంలోని తమ భాగస్వాములన్నింటితో వ్యాక్సిన్‌ ప్రభావం గురించి ఎప్పటికప్పుడు చరించి, వ్యాక్సిన్‌ని మెరు గుపర్చేందుకు చర్యలుతీసుకుంటున్నామని ఆస్ట్రా జెనికా వివరించింది. కొత్త వైరస్‌ స్ట్రెయిన్‌ విసురుతు న్న సవాల్‌ను ఎదుర్కోవడానికి తమ యూనివర్శిటీ ప్రయోగశాలలో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న ట్టు ఆక్స్‌ఫర్డ్‌ సంస్థ పేర్కొంది. 501వై .వి 2 వేరియంట్‌ వైరస్‌ దక్షిణాఫ్రికాలో ఎక్కువగా ఉంది. ఇది ఇప్పుడి ప్పుడే యూకె,యూఎస్‌లలో వ్యాపిస్తోంది. కెంట్‌ వేరియంట్‌ కూడా ఆ తరహాదేనని ఆక్స్‌ఫర్డ్‌ యూని వర్సిటీ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement