Tuesday, October 19, 2021

పిఎ మాతృమూర్తి మ‌ర‌ణం – పాడే మోసిన మంత్రి పువ్వాడ‌..

ఖమ్మం, మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ వ్యక్తిగత సహాయకుడి తల్లి అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రి పాడె మోశారు. ఖమ్మంలోని శ్రీనగర్‌ కాలనీకి చెందిన కిరణ్‌.. పువ్వాడకు వ్యక్తిగత సహాయకుడిగా పని చేస్తున్నారు. ఆయన తల్లి దమయంతి అనారోగ్యంతో మృతి చెందడంతో మంత్రి పువ్వాడ హైదరాబాద్‌ నుంచి ఖమ్మం వచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కిరణ్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News