Thursday, April 25, 2024

చదువుకున్న అజ్ఞానులు

నేటి ప్రపంచం విశ్వాసం, అవిశ్వాసం అనే మానసిక భావజాలం మధ్య ఊగి సలాడుతున్నది. ఈ రెండింటి నడుమ మూఢవిశ్వాసం వాయుమనోవేగంతో విజృంభించడాన్ని చూస్తూనే ఉన్నాం. చాపకింద నీరులా ఎవరికీ అంతుబట్ట ని విధంగా ఒక మానసిక జాఢ్యంలా విస్తరిస్తున్న మూఢనమ్మకమనే మహమ్మారి వైద్య పరిభాషకు కూడా అందనంత ఎత్తుకు దూసుకు పోవడం ఆందోళనకరం. అంధ విశ్వా సాలకు, అతివిశ్వాసాలకు దారితీస్తున్న పరిణా మాలకు మూలకారణం అన్వేషించి, శాస్త్రీయ పరమైన చికిత్స అందించాలి. తాము చేసే పని పట్ల చిత్తశుద్ధి కలిగి ఉండి, జరుగుతుందనే నమ్మ కంతో, సకారాత్మక దృక్ఫథం కలిగి ఉండడాన్ని విశ్వాసం అని చెప్పవచ్చు. ఇలాంటి ఆశావహ దృక్ఫథం అనుకున్న పనులు నెరవేరడానికి ఉత్ప్రే రకంగా పని చేయవచ్చు. కొన్ని సార్లు ఆశావహ దృక్ఫథంతో శ్రమించినా కార్యసిద్ధి జరగక పోవ చ్చు. అది వేరే విషయం. అయితే తాము చేపట్టే కార్యాలు అసాధ్యమైనవని తెలిసినా, మానవ మాత్రులకు సాధ్యం కావని తెలిసినా వాటిని సాధించుకోవాలనే మూర్ఖపు పట్టుదలతో క్షుద్ర పూజలు చేయడం, అతీంద్రియ శక్తులను ఆశ్ర యించడం, లేనిపోని భ్రమల్లో విహరిస్తూ, యథా ర్ధాన్ని విస్మరించి అతి నమ్మకంతో వ్యర్ధ ప్రయత్నా లు చేయడాన్ని ‘మూఢ విశ్వాసం’గా పేర్కొన వచ్చు. నేటి ఆధునిక ప్రపంచంలో విద్యావకాశా లు పెరిగినా, విద్యావంతుల ప్రపంచం ఆవిర్భవిం చినా మూఢనమ్మకాలు కూడా అదే స్థాయిలో పెరగడం అత్యంత బాధాకరం. నమ్మకానికి, మూఢనమ్మకానికి, వాస్తవానికి, అవాస్తవానికి, విశ్వాసానికి, అంధ విశ్వాసానికి మధ్య వ్యత్యాసం కేవలం అక్షరాల్లో వర్ణించలేము. కొంత మందైనా శాస్త్రీయ జ్ఞానం అలవరచుకోకపోతే మూఢ విశ్వాసాలు మరింతగా ముదిరిపోయి, పూర్వం కాలంలో విశృంఖలంగా కొనసాగిన ‘నరబలి’ లాంటి అకృత్యాలు పునరావృతమయ్యే ప్రమా దం లేకపోలేదు. మూఢ విశ్వాసాల వలన ఒరిగే మీ ఉండదు. అంధవిశ్వాసాలను అణచివేసి, అజ్ఞానాన్ని పారద్రోలే క్రమంలో గతంలో ఎంతో మంది శాస్త్రజ్ఞులు ఎన్నో బాధలు పడ్డారు. తాము కష్టాలు పడినా తమ తరువాతి తరం శాస్త్రీయ జ్ఞానం అలవరచుకోవాలనే పట్టుదలతో ఎన్నో ఆవిష్కరణలను ప్రజల ముందుంచారు. ప్రస్తుత ప్రపంచం అనుభవించే సైన్స్‌ ఫలాల వెనుక ఎంతో మంది మేథావుల నిరంతర కృషి ఇమిడి ఉంది. సైన్స్‌ అందించిన వాస్తవాలు మన కళ్ళెదుట కని పించినా, వాటి ఫలితాలను చవిచూస్తూనే, ఇంకా మూఢ విశ్వాసాల మాయా జాలంలో కొట్టుకు పోవడం మూర్ఖత్వం కాక మరేమిటి?
అశాస్త్రీయమైన భావజాలం వేళ్ళూనుకున్న నాడు ప్రజలంతా అంధ విశ్వాసాల వైపే పయని స్తారు. ఇది ప్రగతికి పెను అవరోధం. శాస్త్రీయ దృక్ఫథంతో ఆలోచిస్తే ప్రపంచం పురోగామి పథం లో పయనించగలదు. మూఢనమ్మకం కేవలం ఒక అశాస్త్రీయమైన, అవాస్తవంతో కూడిన మానసిక బలహనత. శాస్త్రవిజ్ఞానం మన కనుల ముందు సాక్షాత్కరించే ఒక హతుబద్దమైన వాస్త వం. వాస్తవానికి, భ్రమకు మధ్య గల వ్యత్యాసాన్ని మానసిక బలంతో, వివేకంతో ఆలోచించగలగా లి. ఎవరి మత విశ్వాసాలు వారివి. ఎవరి మత విశ్వాసాలకు విఘాతం కలగని రీతిలో శాస్త్రీయ జ్ఞానం పెంపొందించాలి. అన్ని మతాల వారు ప్రస్తుతం జరుగుతున్న అవాంఛనీయ అంధ విశ్వాసాలపై తమ వంతు పోరు కొనసాగించాలి. పెరుగుతున్న మూఢ విశ్వాసాలను అరికట్టకపోతే మానవ మనుగడ ప్రశ్నార్ధక మౌతుంది. నిజం చెప్పేవాడి గొంతు నులిమే విష సంస్కృతి ప్రబలి న నేపథ్యంలో అబద్ధాలకే అగ్ర తాంబూలం. చైత న్యం నింపే చేతులను కట్టేసి, గొంతులను నులి మేస్తే సమాజమే పతనమౌతుంది. ఇతరుల గొంతును నొక్కడం కన్నా, తనను తాను తెలుసు కుని, సంస్కరించుకోవడమే నిజమైన జ్ఞానమన్న సోక్రటీస్‌ వాదన సర్వకాల సర్వావస్థలకు అన్వ యించదగ్గ వాస్తవం. కనిపెంచిన వారిని వదిలేసి, కనిపించని శక్తుల కోసం ఆరాటపడడంలో ఆయా సమే తప్ప ప్రయోజనం శూన్యం. వాస్తవాలను వదిలేసి, అవాస్తవాలను, కల్పితాలను విశ్వసించ డం మానుకోవాలి. మూఢ నమ్మకాల వలలో చిక్కుకుని, బలై పోవడం కంటే వాస్తవంలో జీవిం చడం మిన్న.మూఢ విశ్వాసాల బారిన పడి, మూర్ఖమైన ఆలోచనలతో జీవితాలను నాశనం చేసుకోవడం దౌర్భాగ్యం. ఇతరులను చంపి, తాము కూడా చచ్చి సాధించేదేమీ లేదు. ఇటీవలి మదన పల్లి సంఘటన ఆధునిక సమాజా నికి ఒక పెను సవాల్‌ విసిరింది.
– సుంకవల్లి సత్తిరాజు
9704903463

Advertisement

తాజా వార్తలు

Advertisement