Wednesday, May 1, 2024

నేటి సంపాద‌కీయం – కర్నాటక కమలంలో చిచ్చు..

కర్నాటక పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది మంత్రి కెఎస్‌ ఈశ్వరప్ప శుక్రవారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామా కోసం ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పట్టుపడుతోంది. ఆయన రేపో మాపో రాజీనా మా చేయవచ్చన్న వార్తలు వచ్చాయి. సంతోష్‌ పాటిల్‌ అనే కాంట్రాక్టర్‌ నుంచి 40 శాతం ముడుపులు డిమాండ్‌ చేసినట్టు ఆయనపై కేసు నమోదు అయింది. హౖిందూవా హిని నాయకుడైన ఆ కాంట్రాక్టర్‌ తన చావుకు ఈశ్వరప్ప కారణమని ఒక లేఖ రాశారు. ఆ లేఖ ఆధారంగానే ఈశ్వరప్పపై కేసు నమోదు చేశారు. అయితే, తాను ఏ నేరం చేయలేదనీ, పాటిల్‌ ఎవరోతనకు తెలియదనీ, తాను రాజీనామా చేయబోనని మొదట ఈశ్వరప్ప భీష్మీంచారు. రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు శివకుమార్‌, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తదితరులు రెండురోజులుగా బెంగళూరులో ఆందోళనలు జరుపుతూ ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైపై ఒత్తిడి తెస్తున్నారు. దర్యాప్తులో ఈశ్వరప్ప దోషి అని తేలితేనే ఆయనను తొలగిస్తానని బొమ్మై పట్టుబట్టారు. కానీ, కాంగ్రెస్‌ నాయకులు తమ ఆందోళనను ఢిల్లికి మార్చారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నివాసం వద్ద రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలానాయకతంలో ఆ పార్టీ నాయకులు ఆందోళన ఉధృతం చేశారు. ఇక తప్పని పరిస్థితుల్లో ఈశ్వరప్పను రాజీనామా చేయమని బీజేపీ కేంద్ర నాయకత్వం ఆదేశించినట్టు తెలుస్తోంది.

అయితే, బీజేపీని ఇరుకున పెట్టడం ఇష్టం లేక రాజీనామా చేయాలని సచ్ఛందంగా నిర్ణయించుకున్నట్టు గురువారం రాత్రి ఈశ్వరప్ప విలేఖరులతో చెప్పారు. అయితే, మాజీ ముఖ్యమంత్రి యెడియూరప్పతో గల విభేదాల వల్లనే ఈశ్వరప్పచిక్కుల్లో పడ్డారని ఈశ్వరప్ప వర్గీయులు ఆరోపిస్తుతన్నారు. ఈశ్వరప్ప రాష్ట్ర బీజేపీలో సీనియర్‌ నాయకుడు. కర్నాటక బీజేపీ అధ్యక్షునిగా గతంలో వ్యవహరించారు. బీఎస్‌ యెడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర బీజేపీలో ఆయనకు ప్రత్యర్ధి. ఆయన కురుబ సామాజిక వర్గానికి చెందిన వారు. సీనియర్‌ అయిన తనను కాదని యెడియూరప్ప తన సామాజిక వర్గానికి (లింగాయత్‌కి) చెందిన బసవరాజ్‌ బొమ్మై పేరును సిఫార్సు చేశారని ఈశ్వరప్ప అప్పట్లో ఆరోపించారు. ఈశ్వరప్పకు రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) నేపథ్యం ఉంది. కర్నాటకలో బీజేపీ ఎదుగుదలలో ఆయన కృషి ఉంది. అయితే, యెడియూరప్ప తనను ఎదగనివ్వలేదనీ, తనను ముఖ్యమంత్రి కానివ్వకుండాఅడ్డుకుంటున్నారని ఈశ్వరప్ప గతంలో ఆరోపించారు. ముఖ్యమంత్రి పదవి ఖాళీ అయినప్పుడు జగదీష్‌ షెట్టార్‌ పేరును, ఇటీవల తాను రాజీనామా చేయాల్సి వచ్చినప్పుడు బసవరాజ్‌ బొమ్మై పేరునూయెడియూరప్ప సిఫార్సు చేశారనీ, వీరిద్దరూ కూడా యెడియూరప్ప సామాజిక వర్గానికి చెందిన వారేనని ఈశ్వరప్ప ఆరోపణ.

కర్నాటక బీజేపీలో బీసీలు ఎదగకుండా యెడియూరప్ప అడ్డుకుంటున్నారని కూడా ఆయన ఆరోపించారు. ఈ నేపధ్యం నుంచి చూస్తే ఈశ్వరప్పపై కాంట్రాక్టర్‌ ఆరోపణలవెనుక యెడియూరప్ప ప్రోద్బలం ఉందన్న ఈశ్వరప్ప ఆరోపణ అసత్యం కాదేమోననిపిస్తోంది. ఈశ్వరప్పపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ముఖ్యమంత్రి బొమ్మైతీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్‌ – జనతాదళ్‌ పాలనలోనూ, అంతకు ముందు కాంగ్రెస్‌ పాలనలోనూ ఎన్నో అక్రమాలు, అవినీతి ఘటనలు చోటు చేసుకున్నాయనీ, కాంగ్రెస్‌ నుంచి తాము నీతులు నేర్చుకోవల్సిన అవసరం లేదని అన్నారు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు డికె రవి అనే ఐఏఎస్‌ అధికారి కాంగ్రెస్‌ నాయకుని ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని బొమ్మై గుర్తు చేశారు. కాంగ్రెస్‌లో మాదిరిగానే ఇప్పుడు కర్నాటక బీజేపీలో వర్గ కలహాలు పెచ్చుపెరిగాయి. ఈ పర్యవసానంగానే కాంట్రాక్టర్‌ ఆత్మహత్య చోటు చేసుకుని ఉండవచ్చు. ఏమైనా ఇందుకు బాధ్యత వహించి ఈశ్వరప్పను తొలగించాలనీ, లేదా ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ నాయకులు పట్టుపడుతున్నారు. బొమ్మైసానుకూలంగా స్పందించకపోతే రాష్ట్రపతిని కలుస్తామని హెచ్చరించారు. బహుశా అందుకే, ఈశ్వరప్పను రాజీనామా చేయమని పార్టీ కేంద్రనాయకతం ఆదేశించి ఉండవచ్చు. కాగా, ఈశ్వరప్ప రాజీనామాతో సరిపెట్టకుండా ఆయనను అరెస్టు చేయాలని కాంట్ర్రాక్టర్‌ సంతోష్‌ పాటిల్‌ కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు ఈ శ్వరప్ప గతంలో మాజీ ముఖ్యమంత్రి యెడియూరప్ప వైరి వర్గంలో ఉన్నప్పటికీ, బసవరాజ్‌ బొమ్మై ముఖ్య మంత్రి అయిన తరాత యెడియూరప్ప తోచేతులు కలిపారు. యెడియూరప్ప పేరును షిమోగా విమానాశ్రయానికి పెట్టాలని ఈశ్వరప్ప ఇటీవల డిమాండ్‌ చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. రాజకీయా ల్లో శత్రువుకు శత్రువు మిత్రుడంటే ఇదేనేమో!

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement