Sunday, May 12, 2024

పార్లమెంట్‌.. మళ్లీ వాయిదాతో!

పార్లమెంటు వర్షాకాల సమావేశాల మొదటి రోజే ఉభయ సభలూ ఎటువంటి చర్చను చేపట్టకుండా వాయిదా పడ్డాయి. సభలో ఏది మాట్లాడకూడదో, ఏది మాట్లాడవచ్చో నిర్దేశిస్తూ సభా నిబంధనలకు సంబంధిం చిన మార్గదర్శకాలపై గత వారం చివరలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాద, ప్రతివాదాలు జరిగాయి. కొన్ని పదాలను నిషేధిస్తున్నట్టు లోక్‌సభ సచివాలయం మార్గ దర్శకాలను వి డుదల చేయడంపై పరస్పరం విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నారు. ఏ పదాన్నీ నిషేధించడం లేదనీ, సభా సంప్రదాయాలనూ, నియమనిబంధనల ను అందరూ పాటించాలన్నదే తమ అభిమతమని స్పీకర్‌ ఓం బిర్లా స్పష్టం చేసిన తర్వాత సభలో కొంతైనా మార్పు కనిపిస్తుందని అంతా భావించారు. రెండు రోజుల తర్వాత పార్లమెంటు వర్షాకాల ప్రారంభం రోజు నే సభ్యులు ఎవరి వాదనలకు వారు ఉండి పోవడంతో సభ ముందుకు సాగలేదు. దీంతో పార్లమెంటులో ఎప్పుడూ ఇంతే అన్న భావన రాజకీయ పరిశీలకులకే కాకుండా సామాన్యులకు సైతం ఏర్పడింది. పార్లమెం టులో చర్చించాల్సిన అంశాలను సభా నిర్వహణ కమిటీ నిర్ణయిస్తుంది.ఆ కమిటీ సమావేశంలోసభ్యులు తాము ప్రస్తావించదల్చిన అంశాలను వివరించి అజెండాలో వాటికి చోటు లభించేట్టు చూసుకోవచ్చు.

కానీ,అందుకు విరుద్ధంగా ప్రతిపక్ష సభ్యులు సభ ప్రారంభం కాగానే ఎప్పటి మాదిరిగానే తాము లేవనెత్తదల్చిన అంశాల కోసం కేకలు, అరుపులు వేయడంతో ఉభయ సభల్లోనూ గందరగోళం ఏర్పడటంతో సభాపతులు ఎటువంటి చర్చ లేకుండానే సభలను వాయిదా వేశారు.ఈ సంద ర్భంగా సీనియర్‌ పార్లమెంటేరియన్‌గా రాజ్యసభ అధ్యక్షుడు, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు గడిచిన ఐదేళ్లలో తాను రాజ్యసభ కార్యకలాపాలను నిర్వహించడంలో ఎంతో నేర్చుకున్నానని , ఈ పదవీ నిర్వహణ తనకు ఎంతో అనుభవాన్ని ఇచ్చిందని అన్నా రు. ఆయన మాటల్లో ఎంతో నిజాయితీ కనిపించింది. రాజ్యసభ అంటే పెద్దల సభ అని తెలుగులో వ్యవహరి స్తుంటాం, కానీ, ఇప్పుడు పార్లమెంటులోనూ, రాష్ట్రాల ఎగువ సభల్లోనూ దిగువ సభల్లో కన్నా ఎక్కువ గందర గోళం జరుగుతోంది. నిషిద్ధ పదాలుగా పేర్కొనే పదాల వాడకం కూడా ఎగువ సభల్లోనే ఎక్కువ జరుగుతోంది. పార్లమెంటు ఉభయ సభల్లో శాసనసభల కంటే మర్యాద పూర్వకమైన, ఎవరినీ నొప్పించని రీతిలో చర్చలు జరు గుతాయని ఆశించడం తప్పుకాదు. అక్కడా, ఇక్కడా విద్యావేత్తలు, హోదాలలో ఉన్నవారు ఈ పదవులను అలంకరిస్తారు కనుక వారి నోటంట పరుషమైన, సభా సంప్రదాయాలకు భిన్నమైన పదాలు వస్తాయని ఎవరూ ఊహించరు.

అంతేకాకుండా,సభలో ఏ పదాలు ఉపయోగించవచ్చో, ఏవి వాడరాదో వారికి ఎవరూ చెప్పనవసరం లేదు. ఎదుట వారిని నొప్పించని రీతిలో సభలో చర్చలు జరగాలన్నదే మార్గదర్శకాల ఆంతర్యం. పార్లమెంటులో ఈ కట్టుబాటు తప్పడానికి కేవలం ప్రతిపక్ష సభ్యులదే బాధ్యత అని అనలేం.ఎందుకంటే, ప్రభుత్వం కూడా చట్టసభల్లో ఎంతో కాలంగా కొనసాగు తున్న సంప్రదింపుల పద్దతిని పాటించడం లేదన్న విమర్శల్లో అసత్యం లేదు. ఎవరికి మెజారిటీ ఉంటే వారు తమ మాటను, లేదా ప్రతిపాదనను నెగ్గించుకోవాలనే తాపత్రయం తొలి నాళ్ళలో కన్నా ఇప్పుడు ఎక్కువైంది. పట్టింపులు, పంతాలు ఎక్కువయ్యాయి. అయితే, ప్రజ లకు సంబంధించిన అంశాల్లో కూడా ఈఏకపక్ష ధోరణి ని అనుసరించడం అన్‌ పార్లమెంటరీయే అవుతుంది. సభలో సభ్యులు ఉపయోగించే పదాలను అన్‌ పార్లమెం టరీ అని ఎలాగైతే అంటున్నారో, సభా నియామాలనూ, సంప్రదాయాలను ఇరు పక్షాల్లో ఎవరు పాటించకపో యినా అదీ అన్‌పార్లమెంటరీ అవుతుంది. అసలు పార్ల మెంటులో గొడవలకు మూల కారకులెవరని ప్రశ్నించు కుంటే ఇరు వర్గాలూ అని చెప్పుకోవచ్చు.

తాము ప్రతి పాదించిన అంశాన్ని ముందుగా చేపట్టాలని ప్రతిపక్షాలు పట్టుపట్టడంతో గొడవ ప్రారంభమవుతోంది. ఉదాహరణకు సోమవారం నాడు ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) సభ్యులు తమ నాయకుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ సింగపూర్‌ పర్యట నకు అనుమతి ఇవ్వకపోవడాన్నిప్రస్తావించారు. దీనికి కారణాలేమిటో ప్రభుత్వం అధికార పూర్వకమైన ప్రకట న చేసి ఉంటే గొడవ అయ్యేది కాదు. ఉదాహరణ కు మహారాష్ట్రలో శివసేన పార్టీలో చీలికకు కమలనాథులే కారణమని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. దానికి కూడా ప్రభుత్వం తన తప్పులేదని రుజువు పర్చుకున వాదనను ముందుకు తీసుకుని రావచ్చు. బియ్యం, గోధుమలు, పాలు వంటి నిత్యావస రాలపై జిఎస్టీ విధించడంపై ముందుగా చర్చించాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌లో న్యాయం ఉంది. ఇలాంటి అంశాలపై ప్రజల ప్రయోజనాల కోణం నుంచి నిర్ణయాలు తీసుకుంటే గొడవలుండవు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement