Tuesday, May 7, 2024

ఆక్సిజన్‌ మరణాలు…అసత్యాలు

కరోనా రెండవ దశలో ఆక్సిజన్‌ కొరత వల్ల ఎవరూ మరణించలేదంటూ కేంద్ర ఆరోగ్యశాఖ చేసిన ప్రకటనపై పార్లమెంటరీ సంఘం తీవ్రంగా అసంతృప్తిని వ్యక్తం చేసింది. కరోనా విషాద స్మృతులు దేశ ప్రజలను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఎంతోమంది కరోనా వల్ల ఉపాధిని కోల్పోయారు. ఉసురును కోల్పోయారు. మొ దటి దశలో కరోనా తీవ్రతను పసిగట్టడంలో ప్రభుత్వం సంసిద్ధంగా లేకపోవడాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎన్న డూ కనీవినీ ఎరుగని రీతిలో విజృంభించిన కరోనాని ఎలా ఎదుర్కోవాలో తెలియక వైద్యులు, ఈ రంగానికి చెందిన పరిశోధకులు కొంత గందరగోళంలో పడిన మాట నిజమే. రెండో దశలో ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో ఆక్సిజన్‌ను తగినంత నిల్వ చేసి ప్రభుత్వం సన్నద్ధత ప్రకటించింది. ఆక్సిజన్‌ కోసం రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లు నడిపిన సంఘటనలు చరిత్రలో తొలిసారి చూశాం. అలాగే ప్రత్యేక విమానాలను నడప డం మనకు తెలుసు. అనేక ఆస్పత్రులలో ఆక్సిజన్‌ ప్లాంట్లను అప్పటికప్పుడు ఏర్పాటు చేసిన ఉదంతాలు తెలుసు. అయినప్పటికీ అప్పటికే కొంత ప్రాణనష్టం జరిగిపోయింది. ఆక్సిజన్‌ అందక గుజరాత్‌, రాజస్థాన్‌ లలోనే కాక మన తెలుగు రాష్ట్రాలలోను ఎంతోమంది ప్రాణాలు విడిచిన సంఘటనలు మన స్మృతి పథంలోనే ఉన్నాయి. నిరంతర వార్తా స్రవంతులలో ఇందుకు సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆక్సిజన్‌ కృత్రిమ కొరతను సృ ష్టించి రోగుల వద్ద ఎక్కువ డబ్బు ను ప్రైవేటు ఆస్పత్రులు పిండుకున్న సంఘటనలూ మనకు తెలుసు. గత ఏప్రిల్‌లో రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య, స్త్రీ, శిశు సంక్షేమశాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్‌ పవార్‌ చెప్పిన సమాచారం ప్రకారం ఆక్సిజన్‌ కొరత కారణంగా కరోనా రోగులు మరణించలేదు. సభ లో ప్రశ్నోత్తరాల సమయంలో అనుబంధ ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ, 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా లనుంచి వచ్చిన కోవిడ్‌ మృతుల వివరాలలో ఆక్సిజన్‌ కొరత వల్ల మరణించినట్లు ఎక్కడా ప్రస్తావించలేదని ఆమె స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

ఏప్రిల్‌ నాటికి దేశం మొత్తంమీద 5,21,358 మంది కోవిడ్‌ వల్ల మరణించారు. అయినప్పటికీ, దేశంలో 20 రాష్ట్రాలు ఆక్సిజన్‌ కొరత వల్ల ఎవరూ మరణించలేదని నివేదికలు పంపడం వాస్తవ విరుద్ధం కాక మరేమిటి? కరోనా చికిత్స విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎప్పటికప్పు డు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించి పరిస్థితిని తెలుసుకున్నారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వ వైఫల్యం ఉందని అనడా ³నికి కూడా వీలు లేదు. నిజానికి కరోనా మహమ్మారి విజృం భించిన సమయంలో వైద్య, ఆరోగ్యశాఖ యంత్రాం గాన్ని ఆయ న పరుగులెత్తించారు. ప్రైవేటు ఆస్ప త్రులపై కొరడా ఝళిపించారు. వివిధ రాష్ట్రాలకు తగినన్ని వెంటిలేటర్లు సరఫరా అయ్యేట్లు కేంద్రం చర్యలు తీసు కుంది. ప్రభు త్వ ఆస్పత్రులలో కూ డ ఉదాసీనతకు తావు లేకుండా చర్యలు తీసుకోగలిగారు. దేశంలో ఆక్సిజన్‌ కొరతవల్ల కరోనా రోగులు మర ణించలేదని చెప్పడంపై అసహనం వ్యక్తం చేసిన పార్ల మెంటరీ సంఘం ఆక్సిజన్‌ సరఫరా పెంచేందుకు కేంద్రం తీసుకున్న చర్యలను సోదాహ రణంగా వివ రించడం కొసమెరుపు. సోమవారం ఇచ్చిన నివేదికలో వివరాల ప్రకారం, 2021 ఏప్రిల్‌ నాటికి 1292 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ అందు బాటులో ఉంటే, ఏప్రిల్‌ నాటికి 6,593 మెట్రిక్‌ టన్ను లకు, మే 28 నాటికి 10,250 మెట్రిక్‌ టన్నులకు పెంచగ లిగారు. ఇక ఆక్సిజన్‌ సిలెండర్ల విషయంలోనూ పురోగ తి కన్పించినట్లు ఆ నివేదిక వెల్లడించింది. ఆ నివేదికలోని గణాంకాల ప్రకా రం 2020లో 1.02 లక్షల ఆక్సిజన్‌ సిలెండర్లు సేకరిం చగలిగితే, 2021 నాటికి అదనంగా 1.27 లక్షల ఆక్సిజన్‌ సిలెండర్లు సేకరించగలిగింది.

మరోవైపు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం బాగా పుంజుకుంది. అందువల్లనే దేశం మొత్తం మీద 200 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను సరఫరా చేయగలిగారు. ఇది చాలా అపూర్వమైన విషయమని ఐక్య రాజ్య సమితికూ డా ప్రశంసించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సరేసరి. ఆరోగ్య రక్షణకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతను ఇచ్చింది. ఇప్పటికీ ఇస్తోంది. ఇది స్వోత్క ర్ష కానే కాదు. అయిన ప్పటికీ ప్రతి వస్తువుకి కొరత సృష్టించే అలవాటు ఉన్న వారు మన దేశంలో లెక్కకు మిక్కిలి ఉన్నారు. వారివల్ల ఏమైనా, ఎక్కడైనా కొరత ఏర్పడి ఉండవచ్చు. కొరత కూడా కొద్ది రోజులే. ఆ కష్టకాలంలో కొన్ని మరణాలు సంభవించి ఉం డొచ్చు. వాస్తవం ఇది కాగా ఆక్సిజన్‌ కొరత వల్ల ఎక్కడా కరోనా మరణాలు సంభ వించలేద నడం సరికాదు. ఆక్సి జన్‌ పంపిణీ వ్యవస్థలో లోపాల కారణంగా కొన్నిచోట్ల మరణాలు సంభవించిన మాట వాస్తవం. కేంద్రానికి పంపిన నివేదికలో రాష్ట్రాలు ప్రస్తావించి ఉంటే బాగుండేది.

Advertisement

తాజా వార్తలు

Advertisement