Thursday, December 8, 2022

సరిహద్దుల రక్షణకు ప్రాధాన్యం

చైనా, పాకిస్తాన్‌ల పోకడలను దృష్టిలో ఉంచుకుని సరిహద్దులలో మరింత నిఘాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం సబబే. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఇటీవల పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పిఎల్‌ఏ) సమావేశంలో ప్రసంగిస్తూ ఏ సమయంలోనైనా దాడికి సిద్ధంగా ఉండాలని పిలుపు ఇచ్చారు. చైనాపై దాడి చేసేందుకు ప్రస్తుతం ఏ దేశమూ సిద్ధంగా లేదు. అయితే, భారత్‌ను వీలు చూసుకుని దెబ్బకొట్టాలన్నది ఆయన ఆంతర్యం. ఆయనఇటీవల ఇండోనేషియా రాజధాని బాలీలో మన ప్రధాని నరేంద్రమోడీని కలుసుకున్నప్పుడు ముఖం నిండా నవ్వు పులుముకుని పలుకరించారు. కరచాలన చేశారు. అంతమాత్రాన ఆయన మనసులో ఉన్న వ్యూహాలేమిటో కనిపెట్టలేనంత అమాయకత మన ప్రభుత్వంలో లేదు. అందుకే వాస్తవాధీనరేఖ పొడవునా మన భూభాగంలోకి విదేశీ సైనికులెవరూ చొచ్చుకుని రాకుండా పసిగట్టేందుకు దేశీయంగా అభివృద్ధి పర్చిన రాడార్లను లడఖ్‌లో ఏర్పాటు చేసేందుకు యత్నాలు సాగిస్తోంది. ఈ రాడార్లు త్వరలోనే పని చేయడం ప్రారంభిస్తాయి. పదివేల కోట్ల రూపాయిల వ్యయంతో హెచ్‌పిఆర్‌ రాడార్లు, అశ్వినీరాడార్లను ఏర్పాటు చేసేందుకు చకచకా పనులు సాగుతున్నాయి. ఈ రాడార్ల సాయంతో రాజస్థాన్‌, గుజరాత్‌, పంజాబ్‌ సరిహద్దు ప్రాంతాల్లో కదలికలను పసిగట్టేందుకు వీలుంటుంది.

పాకిస్తాన్‌ నుంచి వచ్చే ఉగ్రవాదులు గుజరాత్‌ తీరాన్ని కూడా ఎంచుకుంటున్నారు. సముద్ర మార్గం ద్వారా భారత్‌కి చేరుకోవడం చాలా సులభమైన మార్గమని వారు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. చేపల వేటకు ఉపయోగించే బోటుల సాయంతో భారత్‌లో ప్రవేశించేందుకు పాక్‌ ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఈ బోటుల కదలికలను మన దేశానికి చెందిన తీర రక్షణ దళం గార్డులు కనిపెట్టి వాటిని తరిమి కొట్టారు. చైనా కూడా లడఖ్‌లోని తూర్పు ప్రాంతంలో మన దేశంలోకి సేనలను అక్రమంగా పంపేందుకు ప్రయత్నిస్తోంది. గాల్వాన్‌ ప్రాంతంలోకి చొచ్చుకుని వచ్చిన చైనా సేనలను మన సేనలు తరిమి కొట్టాయి. ఈసందర్భంగా జరిగిన ఎదురెదురు కాల్పులలో మనవైపు 20 మంది పైగా సైనికులు మరణించారు. చైనా వైపు కూడా సైనిక నష్టం జరిగినట్టు సమాచారం అందింది. కానీ, చైనా బుకాయించింది.ఇప్పుడు మరో సారి అలాంటి ప్రయత్నం చేసేందుకు చైనా సరిహద్దు సేనలు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మన భూభాగం లోకి తన సేనలను పంపుతూ మన సేనలే తమ దేశంలోకి చొచ్చుకుని వస్తున్నాయంటూ చైనా బుకాయిస్తోంది. చైనా వైపు సరిహద్దుల్లో సైనికుల చలనాన్ని రాడార్ల ద్వారా గుర్తించడం సులభమే. అందుకే, ఈ వైపు రాడార్ల వ్యవస్థను అభివృద్ధి పర్చాలని మన దేశం నిర్ణయించి ముందుకు సాగుతోంది.

- Advertisement -
   

అరుణాచల్‌ ప్రదేశ్‌, లఢఖ్‌ ప్రాంతాల్లోకి కూడా చైనీస్‌ సేనలు చొచ్చుకుని రావడానికి ప్రయత్నిస్తున్నమాట నిజమే కానీ, అరుణాచల్‌ నుంచి లడఖ్‌ వరకూ కొండలు అడ్డుగాఉండటం వల్ల రాడార్ల వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటికీ ప్రయోజనం ఉండదు. అందుకే, చైనా వైపే రాడార్ల వ్యవస్థను అభివృద్ది చేస్తున్నా రు. లడఖ్‌లోని ధమ్‌చౌక్‌ వద్ద చైనా విమానాలను దింపింది. దానికి దీటుగా మన విమానాలు కూడా సమీపంలోకి వెళ్ళాయి. చైనావైపు రోడ్డుమార్గాన్ని మన దేశం అభివృద్ధి చేస్తోంది. చైనా తన వైపు రోడ్డు మార్గాన్ని ఇంతకుముందే అభివృద్ధి చేసింది. సరిహద్దులలో మౌలిక సదుపాయాలను వృద్ది చేయడంలో చైనా మన కన్నా ముందుంది. అదే మన దేశం మన వైపు మౌలిక సదుపాయాలను కల్పిస్తుంటే భారత సేనలు చొచ్చుకుని వస్తున్నాయని గగ్గోలు పెడుతోంది. ఈ కారణాలన్నింటి రీత్యా చొరబాటు ఎవరిదనేది నిర్ధారించడం కోసం రాడార్లను ఏర్పాటు చేయడ మే మంచిదని మన దేశం భావిస్తోంది.

అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ ప్రాంతం లో సొరంగ మార్గాన్నిమన దేశం నిర్మిస్తోంది.ఇది వచ్చే ఏప్రిల్‌ నాటికి పూర్తి అవుతుంది.ఈ సొరంగ మార్గం ద్వారా కనెక్టివిటీ లభిస్తుంది. ఇది కాకుండా జమ్ము కాశ్మీర్‌లో మూడు,లఢఖ్‌ప్రాంతంలో నాలుగు సొరంగ మార్గాలు పూర్తయ్యే దశలో ఉన్నాయి. మన దేశానికి చైనా నుంచే కాకుండా పాకిస్తాన్‌నుంచి చొరబాట్ల ప్రమా దం పొంచి ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, జమ్ముకాశ్మీర్‌లో 300 మంది ఉగ్రవాదులు చొచ్చుకుని వచ్చారని నార్తరన్‌ కమాండ్‌ కమాండెంట్‌ ఉపేంద్ర ద్వివేదీ తెలిపారు వీరు కాకుండా పాక్‌ వైపు 160 మంది ఉగ్రవాదులు ఏ క్షణంలోనైనా మన దేశంలోకి ప్రవేశిం చేందుకు పొంచి ఉన్నారని ఆయన తెలిపారు. ఉగ్రవాదు లు మన దేశంలోకి మాదక ద్రవ్యాలను చేరవేస్తున్నారనీ, అఎn్గానిస్తాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత మాదక ద్రవ్యాల అక్రమ రవాణా బాగా పెరిగింది. మన దేశంలో ఇటీవల పలు ప్రాంతాల్లో హెరాయిన్‌, మాదక ద్రవ్యాలు భారీ ఎత్తున పట్టుపడుతున్న సంగతి తెలిసిం దే. సరిహద్దుల్లో అన్ని వైపులా రక్షణకు మన దేశం ఇప్పటికే పటిష్టమైన చర్యలు తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement