Thursday, April 25, 2024

విశ్వనాథ్ ని కలిసిన కమల్ హాసన్ .. వైరల్ అవుతోన్న ఫొటో

విక్రమ్ మూవీ హిట్ తో మాంచి జోరుమీదున్నాడు స్టార్ హీరో కమల్ హాజన్ .. కాగా నేడు ఆయన లెజెండరీ డైరెక్టర్, కళాతపస్వి కే విశ్వనాథ్ ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు .. వీల్‌ఛైర్‌లో ఉన్న విశ్వనాథ్‌ చేయి పట్టుకుని ఆత్మీయంగా పలుకరిస్తున్న ఫొటో ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్‌ అవుతోంది. విశ్వనాథ్‌, కమల్‌హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన సాగర సంగమం, స్వాతిముత్యం, శుభసంకల్పం చిత్రాలు తెలుగు సినీ పరిశ్రమలో మరుపురాని ఆణిముత్యాల జాబితా టాప్‌లో ఉంటాయి. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మరో సూపర్‌హిట్‌ సినిమా రావాలని.. అందుకు ఇద్దరూ సహకరించాలంటూ..ఫొటో చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement